మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

0 18

లక్నో (ఉత్తరప్రదేశ్) ముచ్చట్లు :

 

పదమూడేళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో వెలుగుచూసింది. మహోబా జిల్లాలోని శ్రీనగర్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో శ్రీనగర్ ప్రాంత ఆషా కార్యకర్త బాలికకు గర్భస్రావం చేసింది. ఈ కేసులో నిందితుడు ఒకరిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ సుధాసింగ్ చెప్పారు. బాలికకు గర్భస్రావం చేసిన ఆశా కార్యకర్తపై కూడా తాము కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. బాలికపై అత్యాచారం జరిపిన మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని, వారిని  త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Mass rape of a minor girl

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page