రేవంత్ ఎఫెక్ట్… షర్మిలకు షాకే

0 23

హైదరాబాద్ ముచ్చట్లు:

నాయకత్వం మీద నమ్మకుంటే నేతలు వస్తారు. ఓటర్లు కూడా అటు వైపు మొగ్గు చూపుతారు. గెలుస్తారన్న నమ్మకం కలిగిస్తే చాలు రాజకీయంలో యాభై శాతం సక్సెస్ అయినట్లే. ఇప్పుడు తెలంగాణ లో కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమించిన తర్వాత ఉప ఎన్నికల్లో అధికార పార్టీపై గెలిచినంత ఉత్సాహం క్యాడర్ లో కన్పించడమే ఇందుకు ఉదాహరణ. ఇక రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ హైకమాండ్ ఇటు వైఎస్ షర్మిల పార్టీకి కూడా చెక్ పెట్టిందనే అనుకోవాలి.వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ మరింత డీలా పడింది. కాంగ్రెస్ కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లతో పాటు తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ఓట్లు దశాబ్దాలుగా వెంట ఉన్నాయి. అయితే వైఎస్ షర్మిల పార్టీ పెడితే ఆ ఓటు బ్యాంకు ఏపీలో జగన్ తరహాలో తీసుకెళ్లిపోతుందేమోనన్న కంగారు కాంగ్రెస్ నేతల్లో ఉంది. అయితే తాజాగా రేవంత్ రెడ్డి నియామకంతో ఆ భయం చాలా మేరకు తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గెలిపిస్తాడన్న నమ్మకం వచ్చింది. అది చాలు షర్మిల పార్టీ దెబ్బయిపోవడానికి.
తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ వర్గమే పెత్తనం చేసేది. ముఖ్యమంత్రులూ వీరే. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వీరు సైడయిపోయారు. ఇది తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గంలో బలంగా ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో వారికి కొంత ఆశ దొరికింది. ఈ అవకాశాన్ని ఆ సామాజికవర్గం నేతలు వచ్చే ఎన్నికల్లో వినియోగించుకుంటారు. బలం లేని వైఎస్ షర్మిల పార్టీ వైపు చూసే అవకాశం లేదు.కాంగ్రెస్ ను మరింత బలహీన పర్చాలని భావిస్తున్న వైఎస్ షర్మిలకు పార్టీ పెట్టక ముందే రేవంత్ రెడ్డి నియామకం కొంత షాక్ అనే చెప్పాలి. ఆ పార్టీలోకి పేరున్న నేతలు కూడా వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కన్పించడం లేదు. బలమైన నేతలు లేకపోవడం, క్యాడర్ లేమితో కొత్త పార్టీతో వస్తున్న వైస్ షర్మిలకు రేవంత్ రెడ్డి రూపంలో ముందుగానే కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ తోనే నష్టపోనున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Rewanth effect … Shock to Sharmila

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page