రోగులకు మెరుగైన వైద్య సేవలు – చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లక్ష్యం . చెన్నైలో చికిత్స పొందిన రోగుల అభిప్రాయాలు

0 9

నెల్లూరుముచ్చట్లు:

నెల్లూరు జిల్లా ప్రజలకు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తుందని, చెన్నై హాస్పిటల్స్ లలో వైద్య సేవలు, సలహాలు పొందిన పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా ప్రజలు చెన్నై వెళ్లాలంటే ,అక్కడ భాష రాక వారితో తమ సమస్యలు సరిగా చెప్పుకోలేక, ఇబ్బందులు పడుతున్న వారికి చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎంతో సహాయకారిగా ఉంటుందని, అటువంటి సంస్థపై నిందారోపణలు చేయడం సరికాదని పలువురు అంటున్నారు .ఇదివరకు రోగులు చెన్నైకు వెళ్లాలంటే చెన్నైకు వెళ్లి ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడేవారని, ఇపుడు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ను స్థాపించిన వారు చెన్నైలో 13 సంవత్సరాలపాటు పని చేసిన అనుభవంతో, గత  8 సంవత్సరాలుగా సెంటర్ ద్వారా చెన్నై మహా నగరంలోని అన్ని ఆసుపత్రులను విచారించి, అందులో మంచి హాస్పిటల్ ను సెలెక్ట్ చేసి, ఏ రోగానికి ఏ హాస్పిటల్ సరైన వైద్యం అందించగలదో విచారించి, వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి ఈ సెంటర్ ద్వారా అక్కడికి రోగులు వెళ్లక ముందే, వారి పరిస్థితి ముందుగానే అక్కడి వైద్యులకు తెలియజేసి, మెరుగైన వైదే సేవలు అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. అంతే కాకుండా కరోనా మొదటి వేవ్, 2వ వేవ్ కాలంలో  షుమారు 200 మందిని చెన్నె లోని ప్రముఖ హాస్పిటల్ లో ఒకటైన డా” కామాక్షి మెమోరియల్ హాస్పిటల్ 3 బ్రాంచ్ లు కలిగి 500 పడకలు కలిగిన డా. కామాక్షి మెమోరియల్ ఆసుపత్రి లో కరోనా వచ్చిన వారిని పంపి, మెరుగైన సేవలు అందిచారని అక్కడకు వెళ్లిన వారిలో అధిక శాతం మంది సంతృప్తి చెందినట్లు తెలుస్తుందన్నారు. చెన్నై నగరంలోని సిమ్స్,పోర్టిస్, ప్రశాంత్,నోబెల్,మియట్,కావేరి మొదలగు  హాస్పిటల్స్ కి వివిధ వైద్య సేవలపై  వెళ్లి వచ్చిన వారిని మీడియా విచారించగా మంచి సేవలు అందించారని, అందుకు సహాయ సహకారాలు అందించిన చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపారు. సెంటర్ నిర్వాహకులు ఎస్ వి రమేష్ కు అత్యంత ఆప్తులుగా, ప్రాణ స్నేహితులుగా ఉంటూనే, వైద్య సేవలు అందించేందుకు తన వంతు సహకారం అందిస్తూ, సింహపురి ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విషయాన్ని మింగుడు పడక కొందరు ఆయనపై విమర్శనాత్మక ఆరోపణలు చేయడం సరి కాదేమోనని, అటువంటి వారు ఒకసారి  ఆత్మవిమర్శ చేసుకోవాలని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి సలహాలు, వైద్య సేవలు పొందిన అలేఖ్య, శ్రీనివాస్ తదితరులు కోరుతున్నారు.

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Better medical services for patients – Chennai Hospitals Information Center aims
. Opinions of patients treated in Chennai

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page