శాస్త్రోక్తంగా శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం

0 8

తిరుపతి  ముచ్చట్లు:
తిరుచానూరు  శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం  స్వామి, అమ్మ‌వార్ల‌కు అభిషేకం నిర్వ‌హించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాన్ని నిర్వ‌హించారు.   ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంట‌ల వ‌ర‌కు శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో
శ్రీ సుందరరాజస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.  సాయంత్రం శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వ‌హించ‌నున్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

- Advertisement -

Tags:Anointing to Sri Sundararajaswamy scientifically

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page