సచివాలయ ఉద్యోగులపై దాడులు అరికట్టి రక్షణ కల్పించాలి

0 8

తుగ్గలి ముచ్చట్లు:

రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల పై జరుగుతున్న దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని సచివాలయ ఉద్యోగులు ఎంపీడీవో కు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక సచివాలయంలో దాడులు జారుతూనే ఉన్నాయని,నిన్నటి రోజున ప్రకాశం జిల్లా ఈతముక్కల సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ మీద మరియు కర్నూల్ జిల్లా మద్దికెర మండలం బసినేపల్లి వెల్ఫేర్ మీద దాడి మరియు సచివాలయం మూసివేతకి నిరసనగా గా ఎంపీడీఓ ఆఫీస్ మరియు తుగ్గలి,జొన్నగిరి పోలీస్ స్టేషన్లలో వినతి పత్రం అందజేసి రక్షణ కల్పించాలని సచివాలయ ఉద్యోగులు తెలియజేశారు.అంతే కాకుండా మరొకచోట ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మేము ఎంతటి పనినైనా పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని,పథకాలు చేరవేయడంలో ఎటువంటి బేధాభిప్రాయాలు లేకుండా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించే వెల్ఫేర్ సెక్రటరీల మీద దాడులు చేయడం సరికాదని సచివాలయ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు.పథకాల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తూ ఉంటాయని,దానికి గల కారణాలు అడిగి తెలుసుకోవాలని,అక్కడితో సంతృప్తి చెందకపోతే వేరే సచివాలయంలో అడిగి తెలుసుకొని మాట్లాడాలి,అంతేకాని దాడులు చేయడం సరికాదని వారు పై అధికారులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీరరాజు,పరిపాలనాధికారి పార్థ సారథి, సీనియర్ అసిస్టెంట్ జయప్రకాష్,జూనియర్ అసిస్టెంట్ రామబ్రహ్మం,సి.ఓ కృపాకర్,వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు సోము సుందర్, రాము,సూర్యతేజ,పెద్దయ్య,అశోక్,హారిక,రవి, కమల్ తేజ మరియు తుగ్గలి సచివాలయం సిబ్బంది మరియు తుగ్గలి గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్కొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Attacks on Secretariat employees must be prevented and protected

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page