అలా చేస్తే థర్డ్‌వేవ్‌కు ఆస్కారముండదు: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

0 15

దిల్లీ ముచ్చట్లు:

 

ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తే థర్డ్‌వేవ్‌కు ఆస్కారం ఉండదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. థర్డ్‌వేవ్‌ అనేది అది ప్రజల వ్యవహరించే తీరు, వ్యాక్సిన్‌ వేయడంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఒకవేళ వచ్చినా మూడో దశ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయని, దానిపై ముందుకెళ్లేందుకు మరింత డేటా అవసరం ఉందని చెప్పారు.దేశంలో ప్రస్తుతం రోజువారీ కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. యాక్టివ్‌ కేసులు సైతం తగ్గాయని చెప్పారు. అయితే, ఇప్పటికీ కొన్ని చోట్ల పాజిటివిటీ రేటు అధికంగా ఉందన్నారు. అలాంటి ప్రాంతాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆయా ప్రదేశాలు హాట్‌స్పాట్లుగా మారి మరో ప్రాంతానికి విస్తరించకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Doing so will not be acceptable to the Thirdwave: Aims Director

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page