ఆశలు రేపుతున్న చిరుజల్లులు

0 4

ఖమ్మం  ముచ్చట్లు:

ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం 8.77 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే సుమారు 5 లక్షల ఎకరాల్లో విత్తనాలు నాటారు. ముఖ్యంగా పత్తి, కంది, పెసర, అక్కడక్కడా మొక్కజొన్న, ఇతర పంటలు వేశారు. విత్తనాలు నాటేంత వరకూ అడపాదడపా వర్షాలు కురిసినా తీరా మొలకెత్తే సమయంలో వర్షాభావం ఏర్పడంతో విత్తనాలు భూమిలోనే మగ్గిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొంది.ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 4.3లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. కంది, జొన్న, పెసర, మినుము లాంటి పంటలను 70వేల ఎకరాల్లో విత్తనాలువేశారు. దాదాపు వారం రోజులుగా వాన జాడలేక పోవడంతో నాటిన విత్తనాలు మొలకెత్తక, మొలిచిన మొక్కలు వాడిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.రెండు జిల్లాల్లో కలిపి సుమారు 5లక్షల ఎకరాల్లో విత్తనాలు చల్లి వానకోసం ఆకాశానికేసి చూస్తు న్నారు. ఇప్పటివరకు ఎకరానికి రూ.7,300లు పెట్టుబడి పెట్టిన రైతులు ఐదు లక్షల ఎకరాలకు సుమారు రూ.365 కోట్లు ఖర్చుచేశారు. ప్రస్తుతం పెట్టుబడులు దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మొక్కలకు బిందెలతో నీళ్లు పోస్తూ బతికించుకునేందుకు ఆరాటపడుతున్నారు. నీళ్లు పోసేందుకు కూలీలకు రోజుకు రూ.300 కూలి చెల్లిస్తున్నారు. ఇక కౌలు రైతుల కష్టాలు మరింత ఆవే దనగా ఉన్నాయి. ప్రాజెక్టుల్లో నీరున్నా మెట్టపంటల కు అవి అందలేని పరిస్థితి. వైరా రిజర్వాయర్‌లో 5వేల ఎకరాలకు నీరందించే పరిస్థితి ఉన్నా పక్కనే ఉన్న రైతులు స్ప్రింకర్లను వాడుతున్నారు. మరో రెండు రోజుల్లో వర్షాలు ఆశాజనకంగా ఉండకపోతే విత్తనాలు పూర్తిగా మాడిపోయే అవకాశాలున్నాయి. అదేగనుక జరిగితే మళ్లీ విత్తుకునే స్తోమత లేదని రైతాంగం ఆవేదనకు గురవతుంది.ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఆదివారం సాయత్రం పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షం కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఖమ్మం, కారేపల్లి, కొణిజర్ల, రఘునాదపాలెం, ఇల్లందు, ముదిగొండ, మధిర, బూర్గంపాడు, సుజాతనగర్‌, కొత్తగూడెం, జూలూరుపాడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో ఆకాశం మేఘావృత్తం అయింది. అన్ని ప్రాంతాల్లో వర్షం కురవకపోవడంతో మిగతా రైతాంగంలో ఆందోళన నెలకొంది.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Hopeful Chirujallu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page