ఖని లో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

0 5

పెద్దపల్లి ముచ్చట్లు:

డాక్టర్స్ డే వేడుకలను గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక మార్కండేయ కాలనీలోని స్టార్ మౌంట్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్వీట్ లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ లు మాట్లాడుతు 1933లో జార్జియ లోని విండార్లో మార్చి 30వ తేదీన తొలి డాక్టర్స్ డే ని పాటించారనీ, డా.చార్లెస్ బి.ఆల్మండ్ భార్య బ్రౌన్‌ ఆల్మండ్ వైద్యుల గౌరవార్ధము ఒక రోజును కేటాయించాలని నిర్ణైంచిందన్నారు. గ్రీటింగ్ కార్డులు పంపడం, అశువులు బాసిన వైద్యులకు పూలతో నివాళులర్పించడం ద్వారా తొలి డాక్టర్స్ డే ఉత్సవం జరిపారనీ, జాతీయ డాక్టర్స్ డే నాడు ఎర్రని కార్నేషన్‌ పువ్వులను సాధారణంగా వాడేవారన్నారు. యునైటెడ్ స్టేట్స్ లో ప్రతినిధుల సభ డాక్టర్స్ డే పాటిస్తూ1958 మార్చి 30 వ తేదీన తీర్మానం చేసిందనీ, 1990లో నేషనల్ డాక్టర్స్ డే పాటించాల్సిందిగా చట్టాన్ని ప్రవేశపెట్టారనీ తెలిపారు. 1990 అక్టోబర్ 30న అధ్యక్షుడు జార్జి బుష్ మార్చి 30 న నేషనల్ డాక్టర్స్ డేగా పేర్కొంటూచట్టం పై సంతకాలు చేశాడననారు.

 

 

 

- Advertisement -

భారత దేశములో ప్రతియేటా జూలై 1 న నేషనల్ డాక్టర్స్ డే ని జరుపుకుంటున్నామనీ, ప్రముఖ వైద్యుడు డా. బి.సి.రాయ్ గౌరవార్ధం ఈ రోజును నిర్ణయించారనీ, ఈయన 1882 జూలై 01 న జన్మించినారనీ, దేశములో వైద్య రంగానికి ఎనలేని సేవలందించిన ఆ జన్మదిన వేడుకలే డాక్టర్స్ డే ఉత్సవాలుగా జరుపుకుంటున్నామన్నారు. ఈయన స్మారకార్ధం ప్రతీ ఏడూ జూలై ఒకటవ తేదీన వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1962లో ప్రకటించిందనీ, వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి 1976 నుంచి డాక్టర్ బి.సి.రాయ్ పేరు మీద అవార్డులను ప్రధానం చేస్తున్నారన్నారు. నేటి వైద్యులకు, వైద్యవిద్యార్ధులకు ఆదర్శప్రాయుడు డా.బి.సి.రాయ్ అని తెలిపారు. అనంతరం కరోనాతో మృతి చెందిన డాక్టర్ లకు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ నాథ్, డాక్టర్ దామేర అనిల్ కుమార్, డాక్టర్ నాగేందర్ తో పాటు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Doctor’s Day celebrations richly in the mine

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page