గోరక్షకులను ఆరెస్టు చేయడం సరికాదు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

0 9

హైదరాబాద్ ముచ్చట్లు:

 

 

గో రక్షణ విషయంలో  బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు  చేసారు. డిజిపి మహేందర్ తీరుపై మండి పడ్డారు. ఇంకా నేను బ్రతికే ఉన్నా. గో రక్షలకు అరెస్ట్ చేయాలంటే  ముందు నన్ను చేయండని అన్నారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్,  బాంబు ఫ్యాక్టరీలకు అడ్డగా మారుతుంది. వాటిని పోలీసులు పటిచుకోకుండా ఎంఐఎం ఒత్తిడి తలొగ్గి గో రక్ష కులను అరెస్ట్ చేస్తున్నారు. డీజీపీ ఆదేశాల తో డీసీపీలు గో రక్షలకు మీటింగ్స్ పెడుతున్నారు.  రోడ్డుపైన తరలిస్తున్న గోవులను పోలీస్టేషన్ తీసుక వస్తే తీసుక వచ్చిన వారినే అరెస్ట్ చేస్తాం అంటున్నారు.  సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పట్టించుకోకుండా తెలంగాణ పోలీసులు వ్యహరిస్తున్నారు. హైవే చెక్ పోస్టులు పెట్టి గోవులను హైదరాబాద్ లోకి రాకుండా చూస్తాం అని చెప్పి ఉంటే బాగుండేది కానీ అందుకు విరుద్ధంగా గో రక్షకుల పై కేసులు పెడుతా అనడం సరికాదని అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Arresting snatchers is not right
BJP MLA Rajasinghe

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page