జూలై నెల‌లో రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల మందికి పైగా రెండో డోస్ వ్యాక్సినేష‌న్

0 8

హైద‌రాబాద్ ముచ్చట్లు:
జూలై నెల‌లో రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల మందికి పైగా రెండో డోస్ వ్యాక్సినేష‌న్ ఇవాల్సి ఉంద‌ని ఆరోగ్య‌శాఖ సంచాల‌కుడు శ్రీ‌నివాస రావు తెలిపారు. గురువారం మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. నేటి నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సినేష‌న్ ఇస్తున్న‌ట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకున్న వారికి 204 ప్ర‌భుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్ పంపిణీ చేస్తున్నామ‌న్నారు. అదేవిధంగా 636 పీహెచ్‌సీల్లో వాక్‌-ఇన్ రిజిస్ట్రేష‌న్‌లో ప‌ద్ద‌తిలో వ్యాక్సినేష‌న్ అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 3 నుంచి జీహెచ్ఎంసీలో 100 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్ పంపిణీని చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పారు. కొవిషీల్డ్ రెండో డోసు 14 నుంచి 16 వారాల మ‌ధ్య‌లో అదే కొవాగ్జిన్ రెండో డోసు 4 నుంచి 6 వారాల మ‌ధ్య‌లో తీసుకోవచ్చ‌ని తెలిపారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

- Advertisement -

Tags:The second dose of vaccination was given to over 30 lakh people in the state in the month of July

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page