తొలి మహిళ స్పెషల్ కలెక్టర్ గా తమీమ్ అన్సారియా

0 15

కర్నూలు ముచ్చట్లు:

 

రాయలసీమ పరిధిలోని నీటి సాగు ప్రాజెక్టులకు అవసరమైన ఆయు పట్టులాంటి కార్యాలయమే శ్రీశైలం ప్రాజెక్టు కార్యాలయం.గతంలో పలువురు స్పెషల్ కలెక్టర్లుగా వచ్చినప్పటికీ వారందరూ ఐఏఎస్ లు కాదు. కానీ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి అవసరమగు ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్న తరుణంలో శ్రీశైలం ప్రాజెక్టు కార్యాలయం కు ప్రత్యేక కలెక్టర్గా శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియా,ఐఏఎస్ ను నియమించడం పట్ల రైతాంగంలో ఆశలు రేకెత్తిస్తున్నాయి.స్పెషల్ కలెక్టర్ గా రామస్వామి పదవీ విరమణ పొందడంతో గురువారం రోజున శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ గా తమీమ్ అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఉదయం దినపత్రికతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. విశాఖపట్నం తన తోలి పోస్టు అడిషనల్ కమిషనర్ గా పని చేశారని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే నేడు ప్రత్యేక కలెక్టర్గా శ్రీశైలం ప్రాజెక్టు కార్యాలయానికి రావడం వలన రెవెన్యూ శాఖలో కూడా నా వంతు బాధ్యతగా రైతాంగం పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటానని, భూసేకరణకు అవసరమైన అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలియజేశారు.

 

 

 

- Advertisement -

తాను బి ఈ కంప్యూటర్స్ చదివిన తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఐఏఎస్ పై శ్రద్ధ వహించి తల్లిదండ్రుల ఆశీస్సులతో 2017 బ్యాచ్ నందు ఐఏఎస్ గా ఎంపికఅయ్యానని తెలియజేశారు.మా సొంత రాష్ట్రం చెన్నై లో భర్త కూడా ఐఏఎస్ 2012 బ్యాచ్ కర్నూలు జిల్లా లోని అదనపు అభివృద్ధి జె.సి మంజీర్ జిలానీ సమూన్ ఈయనతో వివాహం జరిగిందని, ఆయన స్వస్థలం జమ్మూకాశ్మీర్ అని తెలియజేశారు. మేము ఇరువురము ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన వారమని తెలియజేశారు. అలాగే కార్యాలయంలో ఎలాంటి సమస్యలు లేకుండా రైతుల సమస్యలు పరిష్కరిస్తామని, అదేవిధంగా సిబ్బంది కూడా అత్యంత జాగ్రత్త తో పనిచేసి రైతాంగానికి సహకరించాలని ఆమె తెలియజేశారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags; Tamim Ansaria as the first woman Special Collector

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page