త్వరలోనే ‘దిశ’ ప్రత్యేక కోర్టులు: సీఎం

0 9

విజయవాడ ముచ్చట్లు:

 

దిశ’ కేసుల విచారణకు త్వరలోనే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయబోతున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. దీనికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదిస్తున్నామని చెప్పారు. ఈ కేసుల విచారణకు త్వరలోనే ప్రత్యేక న్యాయస్థానాలు వస్తాయన్నారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం అన్నది ఒక అవసరం, బాధ్యతగా ప్రతీ మహిళ భావించాలన్నారు. ఈ యాప్‌ ఉంటే ఒక అన్నయ్య తోడు ఉన్నట్టేనన్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే 15 నిమిషాల్లో పోలీసులు వస్తారన్నారు. ఆ బటన్‌ నొక్కే సమయం కూడా లేనప్పుడు ఫోన్‌ను చేత్తో అటుఇటూ ఆడించినా పోలీసులకు సమాచారం వెళ్తుందన్నారు. ఈ యాప్‌ కోసం ప్రత్యేకంగా ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులను నియమించామన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Soon ‘Direction’ Special Courts: CM

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page