దసరాలోపే ఆచార్య పూర్తి

0 17

హైదరాబాద్ ముచ్చట్లు:

 

చిరంజీవి ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఇప్పటికే వరుసగా ఓకే చెప్పేసిన తన 4 సినిమాల పనులన్నీ డిలే అవ్వడంతో వన్ బై వన్ సెట్‌రైట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు మెగాస్టార్. లాస్ట్ స్టేజ్‌లో ఉన్న ‘ఆచార్య’ సినిమా తర్వాత చిరంజీవి నెక్ట్స్ సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారో, ఆ పనులెంత వరకూ వచ్చాయో ఇప్పుడు చూద్దాం.మెగాస్టార్ సినిమాల స్పీడ్ పెంచేశారు. చాలా గ్యాప్ తర్వాత ‘ఆచార్య’ షూట్‌కి అటెండ్ అయ్యిన చిరు.. స్పీడ్‌గా ‘ఆచార్య’ షూట్ చేస్తున్నారు. మే లో రిలీజ్ అవ్వాల్సిన ‘ఆచార్య’ సినిమా ఇప్పటికే కోవిడ్‌తో పోస్ట్‌పోన్ అవ్వడంతో సినిమాని ఎట్టి పరిస్థితుల్లో యాజ్ఎర్లీయాజ్ పాజిబుల్ కంప్లీట్ చేసి.. దసరాలోపే థియేటర్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకే దీనికి సంబందించి లాస్ట్ షెడ్యూల్ షూట్‌లో బిజీగా ఉన్నారు చిరంజీవి.ఈ సినిమా కంప్లీట్ కాకుండానే మెగాస్టార్ నెక్ట్స్ సినిమా పని మొదలైపోయింది. ‘ఆచార్య’ తర్వాత చిరంజీవి చేస్తున్న నెక్ట్స్ సినిమా ‘లూసిఫర్’ ని రీమేక్ స్పెషలిస్ట్ అయిన మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా ‘ఆచార్య’ సినిమానే కంప్లీట్ కాలేదు.. ‘లూసిఫర్’ తెరకెక్కేదెప్పుడో అనుకున్న ఆడియెన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు డైరెక్టర్. ఈ మద్య ఫుల్ ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశానని, త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతోందని చెప్పారు మోహన్ రాజా.తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్‌ని నెరేట్ చేసిన మోహన్ రాజాకు వెంటనే ఓకే చెప్పిన మెగాస్టార్ ‘ఆచార్య’ కంప్లీట్ అవ్వగానే లూసిఫర్ షూటింగ్‌కి షిఫ్ట్ అయిపోతారు. లాక్‌డౌన్‌తో ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చెయ్యడం లేటయిన ‘లూసిఫర్’ ని చకచకా ఫినిష్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. అంతేకాదు ‘లూసిఫర్’ సినిమాని 4,5 నెలల్లోనే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు మెగాస్టార్ అండ్ టీమ్..

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Acharya completed within Dasara

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page