దేవరపాలెంలో జగనన్న కాలనీలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

0 8

నెల్లూరు  ముచ్చట్లు:
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీ ఇళ్లకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశచరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి అనేక సంక్షేమ పధకాలకు శ్రీకారంచుట్టి, కొన్ని లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేయడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. అన్ని వసతులతో ఒక అత్యాధునిక గ్రామం ఏవిధంగా ఉంటుందో అదేవిధంగా ఈ జగనన్న కాలనీ కూడా అలాగే ఉంటుందన్నారు. ఈ జగనన్న కాలనీలు చరిత్రలో సువర్ణాక్షరాలతో మిగిలిపోతాయి అని అభిప్రాయపడ్డారు. జగనన్న కాలనీల పధకం భవిషత్తులో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ., ఎమ్.పి.డి.ఓ., ఎమ్.ఆర్.ఓ., శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఛైర్మెన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, దేవరపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి మరియు వై.ఎస్.ఆర్. కాంగ్రస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

- Advertisement -

Tags:MLA Kotamreddy laid the foundation stone for the Jagannath Colonies in Devarapalem

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page