పుంగనూరులో జిక్సిన్‌ పరిశ్రమను రెండేళ్లలో పూర్తి చేస్తాం- ఎండి రాహుల్‌ కరణం

0 444

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పుంగనూరు మండలం ఎంసీ.పల్లె వద్ద నిర్మిస్తున్న జిక్సిన్‌ వారి సిలిండర్లు, బ్యాటరీల పరిశ్రమను రెండేళ్లలో పూర్తి చేస్తామని జిక్సిన్‌ ఎండి రాహుల్‌కరణం తెలిపారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లోక్‌ సభ ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, ఎంపి రెడ్డెప్ప, కలెక్టర్‌ హరినారాయణ్‌, సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషా, మాజీ జెడ్పివైస్‌ పెద్దిరెడ్డి లు కలసి భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్‌కరణం మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటుకు సహకారం అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో పనులు వేగవంతంగా పూర్తి చేసి, తయారీ చేపడుతామన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాలని , పుంగనూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఎంపి మిధున్‌రెడ్డి అందిస్తున్న సేవలు మరువలేనిదన్నారు. జిక్సిన్‌ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు తమకు సహాయ సహకారాలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిక్సిన్‌ చైర్మన్‌ రాజారాం, సీఈవో చంద్రశేఖర్‌తో పాటు స్థానిక నాయకులు నాగరాజారెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, అమరనాథరెడ్డి, సురేంద్రరెడ్డి, వెంకటరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

  

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: We will complete the jigsaw industry in Punganur in two years – MD Rahul Karan

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page