ప్రణాళికాబద్దంగా పట్టణ ప్రగతి  కార్యక్రమం అమలు-రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

0 4

జగిత్యాల  ముచ్చట్లు:

 

ప్రణాళికాబద్దంగా పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్ సూచించారు. గురువారం  జగిత్యాల మున్సిపాలటీ లోని 11వ వార్డు గాంధీనగర్ లో  ఏర్పాటు చేసిన  పట్టణ ప్రగతి  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గోగులోత్ రవి , జెడ్పీ ఛైర్పెర్సన్, దావ వసంత ,స్థానిక ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్పెర్సన్ భోగ శ్రావణి హజరై
మొక్కలు నాటారు . ప్రజల కనీస అవసరాలైన త్రాగు నీరు, విద్యుత్,పారిశుద్ద్యం,విద్య, వైద్యం  వంటి సౌకర్యాలు కల్పించడమే అసలైన అభివృద్ది అని  సీఎం కేసిఆర్ భావిస్తారని మంత్రి  తెలిపారు. ప్రజలకు కనీస అవసరాల కల్పన దిశగా పల్లెప్రగతి, పట్టణ ప్రగతి,హరితహారం కార్యక్రమాలు  ప్రారంభించారని మంత్రి తెలిపారు.గ్రామాలు మరియు పట్టణాలలో పచ్చదనం పెంపొందించే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్లకు పైగా మొక్కలను నాటామని,  3 శాతం మేర గ్రీన్ కవర్  వృద్ది చేసుకున్నామని, ఈ హరితహారంకార్యక్రమం వలన వర్షాలు సకాలంలో కురుస్తున్నాయని మంత్రి  తెలిపారు. గ్రామాలలో కనీస అవసరాలు అందించే దిశగా స్మశానవాటిక, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, నర్సరీ వంటివి సమకూర్చు కున్నామని , అదే దిశగా పట్టణాలో  సమీకృత మార్కెట్, డంపింగ్ యార్డు, డ్రైనెజీ , స్మశానవాటిక, పబ్లిక్ టాయిలెట్ వంటి  సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ప్రభుత్వం అందిస్తుందని మంత్రి  తెలిపారు. పచ్చదనం, పారిశుద్ద్యం ప్రధాన ఏజేండాగా పల్లె, పట్టణ ప్రగతి  కార్యక్రమాలను సీఎం కేసిఆర్ చేపట్టారని  మంత్రి  తెలిపారు.

 

 

 

- Advertisement -

గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి   కార్యక్రమంలో  పెండింగ్ ఉన్న పనులు ప్రస్తుతం పూర్తి చేయాలని   మంత్రి సూచించారు. పట్టణాలలో పూర్తి స్థాయిలో విద్యత్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి  ప్రణాళిక సిద్దం చేసుకోవాలని, ఇంటి పై నుండి వెళ్లే  హై టెన్షన్ వైర్లు తొలగించే దిశగా  చర్యలు తుకోవాలని   అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి  నిర్వహణ సమయంలో క్షేత్రస్థాయిలో గుర్తించిన  సమస్యలను అక్కడిక్కడే  పరిష్కరించేందుకు వీలుగా  అత్యవసరంగా వినియోగించుకోవడానికి  సీఎం మంత్రుల వద్ద రూ.2 కోట్లు, కలెక్టర్ వద్ద రూ. కోటి నిధులు మంజూరు చేసారని మంత్రి తెలిపారు.  సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన చర్యలు పకడ్భందిగా చేపట్టాలని,  నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని,  గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చివేయాలని, లోతట్టు ప్రాంతాలో  వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని  మంత్రి అధికారులకు సూచించారు.  పట్టణ ప్రగతిలో భాగంగా  ఎస్సీలు అధికంగా నివసించే కాలనీలో  ప్రత్యేకంగా అధికారులు  పాదయాత్ర నిర్వహించి సమస్యలను గుర్తించాలని, విద్యుత్, త్రాగు నీరు, లైటింగ్, డ్రైయినేజీ,రొడ్లు వంటి మౌలిక సదుపాయాల  స్థితిగతుల పై నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు.  గ్రామాల్లో హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని, అదే విధంగా  ప్రస్తుతం  పట్టణాలో అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని,  జగిత్యాల పట్టణంలో   పెద్ద ఎత్తున  అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని  మంత్రి సూచించారు.

 

 

ఆనంతరం జడ్పీ చైర్ పర్సన్  దావా వసంత మాట్లాడుతూ  పల్లె, పట్టణ ప్రజలు ఆరొగ్యవంతంగా ఉంటే  బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని భావించి   సీఎం కేసిఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి    కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. మెప్మా, స్వశక్తి సంఘాల మహిళలు మొక్కల పెంపకం, పారిశుద్ద్యం  వంటి అంశాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఆనంతరం
స్థానిక ఎమ్మెల్యే  డా.సంజయ్ కుమార్  మాట్లాడుతూ  ప్రతి  మాసం  జగిత్యాల  మున్సిపాల్టీకి  ప్రభుత్వం  రూ.91లక్షల వరకు నిధులు విడుదల చేస్తుందని   తెలిపారు. పచ్చదనం, పారిశుద్ద్యం  ప్రాధాన్యంగా  మున్సిపాల్టీలు నిరంతరం  పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.  హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు సైతం తమ బాధ్యతగా  మొక్కల సంరక్షణ తీసుకోవాలని తెలిపారు. ప్రజలంతా  కలిసికట్టుగా  పనిచేస్తే పచ్చని  జగిత్యాల  పట్టణాన్ని  తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని  ఎమ్మెల్యే తెలిపారు.

 

 

 

జిల్లా కలెక్టర్   జి. రవి మాట్లాడుతూ  జూలై 1, 2021  నుంచి  జూలై 10, 2021 వరకు  ప్రభుత్వం నిర్వహిస్తున్న 3వ విడత  పట్టణ ప్రగతిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని,  ప్రజాభాగస్వామ్యంతో   పట్టణ అభివృద్దికి  అడుగులు వేయాలని కలెక్టర్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డులో ఉన్న సమస్యలను,  నిర్మాణ వ్యర్థ పదార్థాలను, చెత్త  ప్రదేశాలను , నిరుపయోగమైన  బావులు,  కూలిపొయిన ఇండ్ల వ్యర్థాలను గుర్తించి వాటి తొలగింపు దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాల్టీ వ్యాప్తంగా అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి మున్సిపాల్టీ శుభ్రం చేయాలని,  దానికి అయ్యే వ్యయం సదరు   భూ యాజమానుల  నుంచి  వసూళ్లు చేయాలని  కలెక్టర్ ఆదేశించారు.  జగిత్యాల  మున్సిపాల్టీలో  పెద్ద ఎత్తున  అవెన్యూ ప్లాంటేషన్  చేపట్టాలని,  రొడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని  కలెక్టర్  తెలిపారు    పట్టణాలలో ప్రజల అవసరాల మేరకు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసామని  తెలిపారు. ప్రతి పట్టణంలో వైకుంఠదామం,  ఏకీకృత  మార్కెట్  ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు.   జగిత్యాల పట్టణంలో  సమీకృత మార్కెట్ నిర్మాణ పనుల శంకుస్థాపన ఇటీవల చేసామని, సదరు పనులు త్వరగా పూర్తి చేస్తామని, అదే విధంగా  వైకుంఠదామం  సైతం ఏర్పాటు చేస్తామని  తెలిపారు. పట్టణాలలో చెత్త నిర్వహణకు సంబంధించి   డంపింగ్ యార్డు ఏర్పాటుకు  అవసరమైన స్థల సేకరణ వంటి పనలు పూర్తి చేయాలని  కలెక్టర్ అన్నారు.

 

 

 

మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణీ మాట్లాడుతూ  ప్రభుత్వ లక్ష్యాల సాధనకు  ప్రజల  సహకారం చాలా కీలకమని  తెలిపారు.  గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతి   కార్యక్రమంలో  నిర్వహించిన  పలు పారిశుద్ద్య  కార్యక్రమాలు, పిచ్చి మొక్కల తొలగింపు, డ్రైనేజి క్లీనింగ్, విద్యుత్ సమస్యల పరిష్కారం వంటి వాటివి   ఎలాంటి గ్యాప్ లేకుండా  ప్రస్తుతం  చేపడతామని  తెలిపారు. 10  రోజుల పాటు 3వ విడత పట్టణ ప్రగతి  కార్యక్రమం నిర్వహిస్తున్నామని  తెలిపారు.   జగిత్యాల పట్టణంలో  పచ్చదనం  పెంపొందించే దిశగా  హరితహారం   కార్యక్రమంలో  10 లక్షల మొక్కల పెంపకం దిశగా పనిచేస్తున్నామని,  ప్రతి ఇంటికి 6 మొక్కలు  పంపిణీ చేస్తున్నామని  తెలిపారు.  జగిత్యాల పట్టణ వ్యాప్తంగా  మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించి వాటి సంరక్షణకు పక్కా చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఇంచార్జీ  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  మరియు ఆర్డీఒ మాధురీ, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, డి.ఎఫ్.ఓ వెంకటేశ్వరరావు , వార్డు  కౌన్సిలర్లు, తహసిల్దార్ ఎస్.ఈ. ఎలక్ట్రిసిటీ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Implementation of planned urban development program – State Welfare Minister Koppula Ishwar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page