బీజేపీలోకి వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు

0 11

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన గట్టు శ్రీకాంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన తాజాగా బీజేపీలో చేరారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడుబండి సంజయ్ సమక్షంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీని విమర్శించారు.తెలంగాణలో కేసీఆర్‌ లేకుండా కనుమరుగు చేస్తామని వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో సీఎం కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. ఓటమి భయంతోనే ప్రస్తుత సమయంలో తెలంగాణ సెంటిమెంట్‌ను వారు రెచ్చగొడ్తున్నారని విమర్శించారు. హుజురాబాద్‌లో అధికార టీఆర్ఎస్‌కు అభ్యర్థి దొరకటం కష్టమవుతోందని, అక్కడ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధాటికి ఆ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు అవుతాయని అన్నారు. తలకాయ కిందకు, కాళ్లు పైకి పెట్టినా ఈటలపై టీఆర్ఎస్ గెలవబోదని దన్నారు. ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:YCP Telangana president into BJP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page