బోయకొండను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

0 42

– అభివృద్దిపనులపై సమీక్ష
-పనులను సకాలంలో పూర్తిచేయాలి

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయాన్ని,పరిసర ప్రాంతాలను అత్యంత సుందరంగాతీర్చిదిద్దడమే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం బోయకొండ అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయంలో జెడ్పిసీఈఓ ప్రభాకర్‌రెడ్డి, ఏఐపీపీ మెంబర్‌ అంజిబాబు,పిఆర్‌ డిఈఈ ప్రసాద్‌ లతో కలిసి అభివృద్ది పనులపై సమీక్షించారు.ఈ సంధర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఆలయం వద్ద పనులను వేగవంతం చేసి నెలాఖరులోపు పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవాలకు సిద్దం చేయాలని సూచించారు. ఉపాధిహామీ్య నిధులతో ఆలయం వద్ద పార్కింగ్‌ పనులను పరిశీలించారు. భక్తులకు ఆకర్షణీయంగా, ఆహ్లాదకరమైన వాతావరణంను తలపించేలా వెహోక్కలు పెంచాలని, సిబ్బందికి సూచించారు. సిమెంటురోడ్డు, ప్రహరీ, పుష్కరిణి, మరుగుదొడ్లు నిర్మాణపనులను పరిశీలించారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, కౌన్సిలర్‌ మనోహర్‌,సర్పంచ్‌ షంషీర్‌,ఏఈ పురుషోత్తం తదితరులున్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags: The goal is to beautify Boyakonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page