మెగా గ్రౌండింగ్ మేళ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ శేఖర్ బాబు

0 15

నెల్లూరు  ముచ్చట్లు:
జిల్లాలోని జగనన్న కాలనీల్లో మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్  చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం  నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని జగనన్న కాలనీని సందర్శించారు. అక్కడ లబ్ధిదారులు లే అవుట్లో చేసుకుంటున్న శంకుస్థాపనలను  పరిశీలించారు.
లబ్ధిదారులు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున లే అవుట్ వద్ద కు తరలి వచ్చి తమ తమ ఇళ్లకు శంకుస్థాపన చేసుకునే పనుల్లో నిమగ్నం కావడం చెప్పుకోదగ్గ విశేషం. అందరి కళ్ళల్లో సొంతింటి కల నెరవేరుతోందన్న ధీమా స్పష్టంగా కనిపించింది.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన 54 వేల ఇళ్ల నిర్మాణం  పనులు జులై 1,  3, 4 తేదీల్లో లక్ష్యం మేరకు ఎట్టిపరిస్థితిలోనైనా మొదలుపెట్టాలని అధికారులకు సూచించారు.
లబ్ధిదారులకు కావలసిన ఇసుక, సిమెంట్,  స్టీల్ తదితర సామాగ్రిని సమకూర్చి ఇళ్ల నిర్మాణం ముమ్మరంగా చేపట్టేలా గా చొరవ చూపాలన్నారు.  అనంతరం గృహ నిర్మాణ సంయుక్త  కలెక్టర్ విదేహ్ ఖరే లబ్ధిదారులు వర్ధి పద్మావతి, వెంకటేశ్వర్లుకు  చెందిన ఇంటి శంకుస్థాపనలో పాల్గొని నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే మునిసిపల్ కమిషనర్ దినేష్ కుమార్ లబ్ధిదారులు బి. బి. జాన్, ముక్తియార్ కు చెందిన ఇంటి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్  విదేహ్ ఖరే మాట్లాడుతూ జిల్లాలో జూలై ఒకటో తేదీ ఒక్క రోజే 10 వేలకు పైగా  ఇళ్ల నిర్మాణం పనులు గురువారం ఉదయం 7-30గంటల నుండి ప్రారంభమయ్యాయన్నారు. లబ్ధిదారులను  వారికి మంజూరు అయిన స్థలం వద్దకు తీసుకువచ్చి వాలంటీర్ ద్వారా జియో  కోఆర్డినేట్ లు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఇళ్ళ నిర్మాణం పై పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించామని చెప్పారు.  ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను లేఅవుట్ వద్దకే రవాణా చేసి అందించడం జరుగుతుందన్నారు. అలాగే సిమెంటు,  స్టీలు రాయితీతో సరఫరా చేయడం జరుగుతోందన్నారు.జగనన్న కాలనీ లో ప్రతి ఒక ఇంటికి మంచినీటి సదుపాయం, విద్యుత్తు సౌకర్యంతో పాటు కాలనీల్లో సీసీ రోడ్లు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ , ఫైబర్ నెట్ తదితర మౌలిక సదుపాయాలు అన్నీ  కల్పించడం జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం  1 .80 లక్షల రూపాయలు మంజూరు  చేయడమే కాకుండా మిగిలిన సదుపాయాలతో కలిపి ప్రభుత్వం దాదాపు 6 లక్షల  రూపాయల విలువైన ఆస్తి లబ్ధిదారులకు సమకూరుతోందన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్  కుమార్ మాట్లాడుతూ నెల్లూరు నగరం , రూరల్ కలిపి 16500 గృహాలు మంజూరయ్యాయని అందులో నగరానికి సంబంధించి 8 248 ఇళ్లకుగాను 1200 గృహాలు నిర్మాణ పనులు గురువారం మొదలవుతున్నాయన్నారు. మిగిలినవి ఈ నెల 3 4 తేదీల్లో మొదలు పెడతామన్నారు. ఈ స్థలం జాతీయ రహదారికి పక్కన ఉన్నందున చాలా  విలువైనదని చెప్పారు.  లబ్ధిదారులు వారి చిరకాల వాంఛ అయిన సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలన్నారు. 4 దశల్లో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం పైకాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఉగాది నాటి కల్లా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలన్నారు.
లబ్ధిదారుల అభిప్రాయం.

1. భగత్సింగ్ కాలనీకి చెందిన వర్ధి పద్మావతి మాట్లాడుతూ తాము పేదవారమని, తన భర్త వెంకటేశ్వర్లు తో కలసి  వంట పనికి వెళ్తుంటామని , బాడుగ ఇంట్లో ఉన్నామని , నెలకు 1500 రూపాయలు చెల్లిస్తున్నామని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని,  అమ్మ ఒడి పథకం ప్రయోజనం పొందుతున్నామని, నెలకు దాదాపు పదివేల రూపాయలు ఆదాయం మాత్రం వస్తోందని, ఇంటి బాడుగ కట్టుకోలేక నానా బాధలు పడుతున్నామని చెప్పారు.  జగనన్న తమ వంటి పేద వారిని గుర్తించి ఇల్లు మంజూరు చేయడం చాలా ఆనందంగా వుందని, అందుకు  ముఖ్యమంత్రి జగనన్నకు మా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
2. జాకీర్ హుస్సేన్ నగర్ న్యూ కాలనీకి చెందిన స్రవంతి మాట్లాడుతూ తాము పేదవారమని,  బాడుగ ఇంట్లో నెలకు అద్దె 2300 రూపాయలు చెల్లిస్తున్నామని, ఇద్దరూ చిన్నపిల్లలు ఉన్నారని , తన భర్త నాగార్జున ఆటో డ్రైవర్ అని,  వాహన మిత్ర ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి అందిందన్నారు. నెలకు పదివేల రూపాయల ఆదాయం వస్తుందని, జగనన్న తమకు ఇల్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఇంటి బాడుగ ఆకట్టుకోలేక చాలా ఇబ్బంది పడేవారమని, గతంలో ఎవరూ పట్టించుకోలేదని,  మాకంటూ ఒక సొంత ఇల్లుకష్టపడి కట్టుకుంటా మన్నారు.ఇల్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగనన్నకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

3 జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన మనం గారి  రమణమ్మ మాట్లాడుతూ తాము చాలా పేద వారమని, తన భర్త శ్రీను తో కూలి పనులకు వెళ్తూ ఉంటామని, నెలకు పది వేల లోపు ఆదాయం వస్తుందని, అద్దె ఇంట్లో నివసిస్తున్నామని, నెలకు 2500 రూపాయలు చెల్లిస్తామని, చాలా కష్టంగా ఉందని చెప్పారు. తమకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు ఉన్నారని, అమ్మ ఒడి పథకం ప్రయోజనం పొందుతున్నామని చెప్పారు.  అప్పు చేసైనా సరే ఇల్లు కట్టుకుంటా మన్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఒక లక్ష 80 వేల రూపాయలు సరిపోవని మరికొంత పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇల్లు మంజూరు చేసినందుకు జగనన్నకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు సంయుక్త కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ వెంట మున్సిపల్     ఎస్.ఇ.సంపత్, పబ్లిక్ హెల్త్ ఇ. ఇ చంద్రయ్య, డి.ఇ.  అనిల్ తదితర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Mega grinding fair should be a success: District Collector Shekhar Babu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page