విపత్తు వేళ స్వచ్ఛంద సంస్థల వితరణ ప్రశంసనీయం గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్

0 19

నెల్లూరు  ముచ్చట్లు:
కరోనా వైరస్ విపత్తు వేళ సంఘ సేవా సంస్థలు అందిస్తున్న సహకారాలు, వితరణ ఎంతో హర్ష దాయకమని గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ ప్రశంసించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు లో ప్రజలకు అత్యవసర వేళ ప్రాణవాయువు అందించేందుకు 27 లక్షల రూపాయలు విలువ కలిగిన 27 ప్రాణవాయువు యంత్రాలను ఎ. అర్. డి. సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ ఆర్ డి బషీర్ ఆధ్వర్యంలో ఇండియా, యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థలు రంగా వితరణ ఇవ్వడం అభినంద నీయమని ఆయన కొనియాడారు. సుమారు 30 సంవత్సరాలుగా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్యంగా తీరప్రాంత మత్స్యకారులకు ప్రత్యేకంగా గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి, ఆదుకున్న ఘనత ఆశంస్త ఎక్జిక్యూటివ్  డైరెక్టర్ బషీర్ కే దక్కుతుంది ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించడం ఆషామాషీ కాదని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ, అంచెలంచెలుగా బషీర్ ఎదిగి బడుగు బలహీన వర్గాల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని బషీర్ సేవలను కొనియాడారు . ఈ సందర్భంగా ఏ ఆర్ డి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బషీర్ మాట్లాడుతూ ఎ. ఆర్. డి. స్వచ్ఛంద సేవాసంస్థ ద్వారా  10 లీటర్ల సాంద్రత గల 27 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు వెలగపల్లి వర ప్రసాద్ ద్వారా, 10 గూడూరు , 2 చెన్నూరు, 10 కోట, 5 బాలి రెడ్డి పాలెం ఆసుపత్రులకు  వితరణగా ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో  ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ,వైద్యులు, సిబ్బంది రేణుకాదేవి, ఎ. ఆర్. డి. స్వచ్ఛంద సంస్థ సిబ్బంది హుస్సేన్, ఏడుకొండలు, రవి సొంసేఖర్, హైమవతి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

- Advertisement -

Tags:The distribution of charities in the event of a disaster is commendable
Gudur legislator Varaprasad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page