వీహెచ్ కు సోనియా ఫోన్

0 18

హైదరాబాద్ ముచ్చట్లు:

 

 

లంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ కూడా ఆశించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రధానంగా పోటీలో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ఉండడంతో ఆయన వెనకబడిపోయారు. మొదటి నుంచి ఆయన రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎన్నో సార్లు విలేకరుల సమావేశం నిర్వహించి, ఏళ్ల తరబడి పార్టీకి విధేయులుగా ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరికి పీసీసీ పదవి రేవంత్ రెడ్డినే వరించింది.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్యం బాగోలేని వేళ ఆయన్ను పరామర్శించారు. అనారోగ్యంతో కొద్ది రోజులుగా వీహెచ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోనియా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కిడ్నీలో ఇన్ఫెక్షన్‌తో పాటు ఇంతకు ముందు కరోనా వచ్చిందని.. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని సోనియాకు వీహెచ్ చెప్పారు. ఆరోగ్యం కాపాడుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సోనియా సూచించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి, కేసీ వేణుగోపాల్‌కు వీహెచ్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Sonia phone to VH

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page