వైద్యరత్న- సేవారత్న అవార్డుల ప్రదానోత్సవం

0 8

నెల్లూరు ముచ్చట్లు:

 

పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం  హైదరాబాద్  చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభ నందు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న డాక్టర్లకు ‘వైద్యరత్న’, సమాజాసేవకులకు ‘సేవారత్న’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ముందుగా ముఖ్య అతిధులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. ప్రసన్న, డాక్టర్ జె.శాలిని యాదవ్, డాక్టర్ అనురాధ లకు వైద్యరత్న అవార్డులు అందజేశారు. అనంతరం ఎస్.ఎస్.రామారావు, ఎస్. రామచంద్రరావు, ఎన్. వేణుగోపాల్ శర్మ, ఎమ్.మధుసూదన్ రావు, టి.నరసింహరావు, టి.సత్యనారాయణ, జి.నంద కిషోర్, జె.శేఖర్ రెడ్డి, పి.జోసఫ్ రాజు, బి.బ్రహ్మానందం, పి.బాలాజీ, మాగంటి శ్రీధర్, దారా శంకర్ లను సేవారత్న లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో  ‘పెన్షనర్స్ ప్యారడైజ్’ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ  త్రైమాసిక  సంచిక విడుదల చేసారు. ఈకార్యక్రమంలో మల్కాజిగిరి జడ్జి బూర్గుల మధుసూదన్ రావు, సినీ దర్శకుడు చంద్ర మహేష్, కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా కె. మురళీమోహన్ రాజు, ఎమ్.భరత్ రెడ్డి, గాయకులు భవాని,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Vaidyaratna- Sevaratna Awards Ceremony

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page