శభాష్ పురం గ్రామం నందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్ఐ షామీర్ భాష

0 7

తుగ్గలి ముచ్చట్లు:

 

తుగ్గలి మండల పరిధి లోని గల శభాష్ పురం గ్రామం నందు తుగ్గలి ఎస్.ఐ షామీర్ భాష అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.గురువారం రోజున మహిళా పోలీసుల ఆధ్వర్యంలో శభాష్ పురం గ్రామంలో పర్యటించి ప్రజలకు శాంతి భద్రతలపై, కరోనా నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎస్.ఐ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు ఎటువంటి గొడవలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో జీవించాలని తెలియజేశారు. ఏవైనా గ్రామాలలో సమస్యలు ఏర్పడితే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన తెలియజేశారు.గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే తమకు సమాచారం అందించాలని తెలియజేశారు.గ్రామాలలో సారా, మట్కా మరియు పేకాటలను ప్రోత్సహించకుండా పూర్తిగా అరికట్టాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా ప్రజలు బయట తిరిగేటప్పుడు తప్పకుండా కరోనా నివారణ చర్యలను తప్పకుండా పాటించాలని ఆయన తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై,కరోనా నివారణ చర్యలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రజలను హెచ్చరించారు. గ్రామాలలో ఎటువంటి అల్లర్లకు చోటివ్వకుండా ప్రజలు సంతోషంగా గ్రామాలలో జీవనం కొనసాగించాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి పోలీస్ సిబ్బంది,మహిళా పోలీస్ సిబ్బంది,గ్రామ వాలంటీర్లు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: SI Shamir Bhasha conducted an awareness program in Shabashpuram village

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page