సమాజములో వైద్యులను మనుషులుగా గౌరవించి ఆదరించాలి

0 6

– డాక్టర్ కన్నన్ హెచ్ఓడి నారాయణ  హాస్పిటల్

 

నెల్లూరు ముచ్చట్లు:

 

- Advertisement -

సమాజంలో వైద్యులను సాటి మనుషులుగా గౌరవించాలి ఆదరించాలి  నారాయణ దంత వైద్యశాల హెచ్ఓడీ డాక్టర్ ఎన్ కన్నన్ అన్నారు  .డాక్టర్స్ డే సందర్భంగా  గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్వతంత్య్ర పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు  .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్లు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిర్విరామంగా కృషి చేస్తారని వారిని దయ్యాలతో, దేవుళ్లతో పోల్చవద్దని సాటి మానవులగా గుర్తించి,అభిమానిస్తే చాలన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ యశోధర మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యులు ప్రజలకు అందించిన సేవలు అమోఘమని అన్నారు.  కరొన లాంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని వైద్యశాలలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అరవ జయ ప్రకాష్ ,రాయప్ప మాట్లాడుతూ నెల్లూరులో డాక్టర్ బెరమ్మా డాక్టర్ జెట్టి శేషారెడ్డి లాంటి ఎందరో ప్రముఖులు పేదలకు సేవలందించారన్నారు.పేదలకు  ధనవంతులకు కనపడే దేవుళ్లు డాక్టర్లే అన్నారు.డాక్టర్లకు ప్రజలకు మధ్యవర్తుల అవసరం లేదని  అన్నారు  .ఈ సందర్భంగా డాక్టర్లు కణ్ణన్, యశోధరా, ఎం వి రమణయ్య, కిషోర్ , పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్  లను ఘనంగా సన్మానించారు. వాకర్స్ అసోసియేషన్ కోశాధికారి రామ్మోహన్ ఉపాధ్యక్షుడు బండి ప్రసాద్,  దయాకర్, శ్రీనివాస్రెడ్డి ,హజరత్, వీర , పీజీ విద్యార్థులు  బండి స్వాతిక తదితరులు పాల్గొన్నారు   .

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Doctors should be respected and respected as human beings in the society

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page