సొంతింటి కలలను నిజం చేస్తున్నాం

0 10

పిఠాపురం  ముచ్చట్లు:
పేదల సొంతింటి కలను నిజం చేసిన మహనీయుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని,పదికాలాలపాటు ఆయన  ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని  పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు.”జగనన్న అందరికీ ఇళ్ళు” పథకంలో భాగంగా గొల్లప్రోలు నగరపంచాయతీ పరిధిలోని “జగనన్న హౌసింగ్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటుచేశారు.ఈ  కార్యక్రమానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.సుమారు మూడు వేల మంది లబ్ధిదారులతో కలిసి  ఎమ్మెల్యే దొరబాబు నూతన గృహ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి,శంకుస్థాపన చేశారు.అనంతరం లబ్ధిదారులతో ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడారు.ఈ సందర్భంగా వైసీపీ  నాయకులు ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో నగరపంచాయతీ ఛైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు,వైస్ ఛైర్ పర్సన్ తెడ్లపు అలైఖ్యారాణి,పిఠాపురం ఏఎంసీ ఛైర్మన్ తెడ్లపు చిన్నారావు,కౌన్సిలర్లు గంటా అప్పలస్వామి,గండ్రేటి రాము,వైసీపీ నాయకులు మొగలి అయ్యారావు,జ్యోతుల భీముడు,పర్ల రాజా,దాసం లోవబాబు,హౌసింగ్ ఏఈ కొత్తెం ఏసుబాబు,మున్సిపల్ కమీషనర్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

- Advertisement -

Tags:We make our dreams come true

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page