అంతర్జాతీయ సరిహద్దుల్లో ద్రోణులు

0 15

శ్రీనగర్  ముచ్చట్లు:
జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి తర్వాత.. పాకిస్థాన్ సరిహద్దుల్లో రోజూ డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేగుతోంది. తాజాగా, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఓ డ్రోన్ చక్కర్లు కొట్టినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించినట్టు తెలిపాయి. ఇది భద్రత ఉల్లంఘనకు పాల్పడటమేనంటూ భారత్ నిరసన తెలిపింది. తాజా ఘటనతో జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి వెనుకు దాయాది పాకిస్థాన్ హస్తం ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.సాంకేతికత సాయంతో జమ్మూ విమానాశ్రయంపై జరిపిన దాడి వెనుక పాకిస్థాన్ మద్దతున్న లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలున్నట్టు భావిస్తున్నామని 15 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే బుధవారం వ్యాఖ్యానించారు. మరోవైపు, వరుసగా ఐదో రోజూ జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద డ్రోన్ల సంచరించాయి.శుక్రవారం తెల్ల‌వారుజామున‌ అర్నియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ డ్రోన్ సంచ‌రించింది. పాకిస్థాన్ నుంచి దూసుకొచ్చి సరిహద్దుల్లోని జుమ్మత్ పోస్టు వ‌ద్ద ఇది తిరుగుతూ కనప‌డింది. పాక్‌ భూభాగం వైపు ఫెన్సింగుకు అవతల దీన్ని చూసిన బీఎస్ఎఫ్ జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్ తోక‌ముడిచి తిరిగి పాకిస్థాన్‌ వైపు వెళ్లిపోయింది.డ్రోన్ కెమెరాతో అక్క‌డి ప్రాంతాల‌ను చిత్రీకరించడానికి ప్ర‌య‌త్నాలు జ‌రిపిన‌ట్లు భార‌త సైన్యం అనుమానిస్తోంది. జమ్ము ఎయిర్‌పోర్టులోని ఐఏఎఫ్ ఎయిర్ బేస్ వ‌ద్ద డ్రోన్లతో దాడి జ‌రిగిన అనంత‌రం మ‌ళ్లీ ప‌దే ప‌దే డ్రోన్లు సంచ‌రిస్తూ ఆందోళ‌న రేపుతోన్న విష‌యం తెలిసిందే. జ‌మ్ములో డ్రోన్లు క‌న‌ప‌డ‌డం ఇది ఐదో సారి. దీంతో ఇప్ప‌టికే అప్ర‌మ‌త్త‌మైన భార‌త సైన్యం పాక్ డ్రోన్ల ద్వారా దాడుల‌కు పాల్ప‌డ‌కుండా మిలిట‌రీ కేంద్రాల వద్ద యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

- Advertisement -

Tags:Drones on international borders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page