అప్ డేట్ పాలిటిక్స్ లో లోకేష్

0 13

గుంటూరు ముచ్చట్లు:

 

 

నారా లోకేష్ కి సలహాలు ఇపుడు బాగానే అందుతున్నాయి. ఆయన తండ్రి చంద్రబాబు ఎటూ చాణక్యుడిని చంపి పుట్టిన వాడు. అదే సమయంలో నారా లోకేష్ సొంతంగా ఒక అడ్వైజరీ టీమ్ ని పెట్టుకుని ఈ కాలానికి తగినట్లుగా పాలిటిక్స్ చేస్తున్నారు. లోకేష్ మేకోవర్ నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్, మాటల తూటాలు అన్నీ కూడా సలహాదారుల నుంచి వచ్చినవే అంటున్నారు. నారా లోకేష్ జగన్ని కిర్రెక్కించాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. జగన్ ని ఢీ కొడితే పేరుకు పేరు వస్తుంది. రాజకీయ స్థాయి కూడా పెరుగుతుంది. అదే సమయంలో ఆయనకు చిర్రెత్తుకు వస్తే కాగల కార్యం నెరవేరుతుంది అన్నదే లోకేష్ ఆలోచనట.రఘురామరాజు వైసీపీలో రెబెల్ ఎంపీ, ఆయన్ని జగన్ సర్కార్ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. తన మీద రిమాండ్ లో పోలీసులు దాష్టికానికే పాల్పడ్డారంటూ రాజు చేసిన ఆరోపణలు, రాసిన లేఖలు ఇపుడు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి. ఒక్క దెబ్బకు జగన్ సర్కార్ ని బదనాం చేసి పారేశారు. ఇదిలా ఉంటే ఆయన్ని చూసిన మీదట నారా లోకేష్ లోనూ కొత్త ఆలోచనలు వస్తున్నాయట. తాను కూడా గట్టిగానే జగన్ మీద బాణాలు వేయడం కూడా అందుకోసమేనట.

 

 

 

- Advertisement -

నారా లోకేష్ ఒక్కసారి అయినా అరెస్ట్ కావాలని ఉందిట. ఏపీలో జగన్ సర్కార్ కొలువు తీరాక టీడీపీలో మంత్రులుగా పనిచేసిన వారి నుంచి పెద్ద నాయకులను చాలా మందిని అరెస్ట్ చేశారు. అయితే నారా లోకేష్, చంద్రబాబు మీద వైసీపీ చూపు ఉందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. వారిని అరెస్ట్ చేసి జైలు దారి చూపించాలని వైసీపీ పెద్దలు అనుకున్నా రాజకీయ సమీకరణలలో తేడాలు వస్తాయనే ఇన్నాళ్ళూ ఆగారు. కేవలం పోలీస్ కేసులు మాత్రమే పెడుతూ వస్తున్నారు. అయితే ఇపుడు నారా లోకేషే ముందుకు వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నట్లుగానే దూకుడు చూపిస్తున్నారు.నారా లోకేష్ అసలు తగ్గేది లేదు అన్నట్లుగా జగన్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. కర్నూల్ టూర్ లో జగన్ ని ఏక వచనంతో సంభోదిస్తూ కొంత వివాదస్పదమైన వ్యాఖ్యలే లోకేష్ చేశారు.

 

 

 

ఆ వెంటనే అన్న కాదు దున్న అంటూ జగన్ మీద దారుణమైన కామెంట్స్ చేశారు. అంటే నారా లోకేష్ ఉద్దేశ్యం తెలిసిపోతోంది అంటున్నారు. జగన్ ని గట్టిగా గిల్లీ గిచ్చి తాను అరెస్ట్ కావడమే ఆయన టార్గెట్ అంటున్నారు. ఇలా పర్సనల్ గా విమర్శలు చేస్తే జగన్ ఊరుకునే రకం కాదు, అరెస్ట్ చేస్తారు. అపుడు జనంలో ఒక్కసారి సానుభూతి వస్తుందని, అలా తాను భావి నాయకుడిగా షార్ట్ కట్ లో ఎదిగిపోవచ్చునన్నదే నారా లోకేష్ ఆలోచనట. మరి లోకేష్ వ్యూహం ప్రకారమే జగన్ని టార్గెట్ చేస్తున్నారు. జగన్ కానీ వైసీపీ పెద్దలు కానీ ఈ విషయంలో ఎంతవరకూ సహనం పాటిస్తారు అన్నది డౌటే. పైగా వారికి నారా లోకేష్ ని అరెస్ట్ చేయాలని ఎటూ కోరిక ఉంది. దాంతో నారా లోకేష్ ఏదో రోజున అరెస్ట్ కావడం ఖాయమే. మరి అంతా అనుకున్నట్లుగా ఆయన మీద జనాలలో సింపతీ వస్తుందా అన్నదే.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags; Lokesh in Update Politics

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page