ఎస్సీలపై అక్రమ కేసులు బనాయించిన ఎస్సై పై చట్టరీత్య చర్య తీసుకోవాలి  బహుజన సమాజ్ వాది పార్టీ డిమాండ్

0 13

నెల్లూరు   ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా, దగదర్తి మండలం, కాట్రాయపాడు గ్రామ అరుంధతీయులపై అక్రమ కేసులు బనాయించిన స్థానిక మండల సబ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు వాకాటి శ్రీనివాసులు మాట్లాడుతూ రేషన్ బియ్యం పంపిణీ విషయమై బంధువుల మధ్య ఫిబ్రవరిలో జరిగిన తగాదా విషయమై విచారణ నెపంతో గుర్రం చిన్న చెంచయ్య ఇంట్లోకి ఈ నెల 24న ఎస్సై వేణుగోపాల్, కానిస్టేబుల్స్ కార్తీక్, సునీల్ అక్రమంగా  చొరబడి, ఆ సమయంలో ఇంట్లో ఉన్న చిన్న చెంచయ్య ను చొక్కా పట్టుకొని కొట్టుకుంటూ జీపు దగ్గరకి తీసుకొని వెళుతుండగా, చెంచయ్య భార్య, తండ్రి (80), కూతురు(13) అడ్డుపడి ఎందుకు లాక్కొని వెళ్తున్నారు, ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించడంతో ఎస్సై,  కానిస్టేబుల్స్ ముసలి ముతక, చిన్నాపెద్ద ,ఆడ మగ తేడా లేకుండా అడ్డువచ్చిన అందరిని కొట్టడం సరికాదని ఎస్ ఐ నియంత చర్యలను ఖండించారు. ఈ విషయమై చిన్న చెంచయ్య చిన్నాన్న కొడుకు గుర్రం రవి బాబు( సాఫ్ట్వేర్ ఇంజనీర్) వీళ్లను రేపు 25 మంగళవారం స్టేషన్కు తీసుకు వస్తానని చెప్పడంతో పోలీసులు , రవి బాబు తోపాటు అక్కడ ఉన్న మరో కొంత మంది యువత పేర్లు రాసుకుని వెళ్లారని చెప్పారు. ఈ విషయమై 25 వ తేదీ మంగళవారం గుర్రం చెంచయ్యను తీసుకొని గుర్రం రవిబాబు మరికొంతమంది స్టేషన్ కు వెళ్లడం జరిగిందన్నారు. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలతో 24న సోమవారం రాత్రి ఉద్దేశపూర్వకంగానే గుర్రం గుర్రం రవి బాబు తో పాటు మరో 6 మందిపై అక్రమ కేసులు బనాయించి నట్లు తెలిసిందన్నారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుర్రం రవిబాబు మాట్లాడుతూ ఎస్సై వేణుగోపాల్ తో తాను ఇంగ్లీషులో మాట్లాడటమే కాకుండా, తను ప్రశ్నించిన అందుకే కేసులు పురమాయించి నట్లు తెలిసిందన్నారు. దళితులు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, ఇంగ్లీషులో మాట్లాడటం తప్పా అని అధికారులను  ప్రశ్నించారు.  ఎస్ఐ వేణుగోపాల్ స్థానిక రాజకీయ నాయకులు చెప్పినట్లుగా వారు కేసు కట్టమంటే కట్టడం, కట్టకపోవడం చేయడం అతనికి పరిపాటే అన్నారు. దళితులను చులకన భావంతో చూడడమే కాకుండా అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదన్నారు. ఎస్సై వేణుగోపాల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా  జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయమై సత్వరమే స్పందించి, విచారించి తగు న్యాయం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో బహుజన సమాజ్  పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఘని, కావలి నియోజకవర్గ ఇన్చార్జి ఉదయ భాస్కర్, బాధితులు వెంకట రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

- Advertisement -

Tags:Legal action should be taken against the SC who has made illegal cases against the SC
Bahujan Samaj Wadi Party demand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page