ఏపి లో రూ.8 వేల కోట్లతో సచివాలయాలు, మిల్క్ చిల్లింగ్‌ సెంటర్ల నిర్మాణం

0 95

-ఈనెల 8న ప్రారంభం
– రాష్ట్ర ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ డైరెక్టర్‌ చిన్నతాతయ్య

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సచివాలయాలు, చిల్లింగ్‌ సెంటర్లు , వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణానికి రూ. 8వేల కోట్లు కేటాయించడం జరిగిందని, వాటిని ఈనెల 8 న ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ డైరెక్టర్‌ చిన్నతాతయ్య తెలిపారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌, పీడి చంద్రశేఖర్‌, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి మండలంలోని సుగాలిమిట్టలో సచివాలయము, ఆర్‌బికె , వెల్‌నెస్‌ సెంటర్లను ఆయన పరిశీలించి, పనులు వేగవంతంగా , అత్యంత నాణ్యంగా జరుగుతున్నాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈనిర్మాణాలను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. నెల్లురు, గంటూరు, ఒంగోలు, చిత్తూరు ప్రాంతాలలో పర్యటించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 11 వేల సచివాలయాలలో 4వేలు పూర్తి కాబడిందన్నారు. 6 నెలలోపు పూర్తి స్థాయిలో అన్నింటిని నిర్మించి, ప్రజల ముంగిటకు పరిపాలనను అన్నిశాఖల ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఆశించిన మేరకు అన్ని కార్యాలయాలు ఎక్కువ ప్రాంతాలలో ఒకే చోట నిర్మించడం జరుగుతోందన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మునితుకారాం,ఏపిడి చందన, సర్పంచ్‌ దేవమ్మ, మండల మాజీ ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి తో పాటు ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags: Construction of Secretariats and Milk Chilling Centers at AP at a cost of Rs 8,000 crore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page