కాలనీ కి దారేది…

0 12

జగిత్యాల ముచ్చట్లు:
జగిత్యాల పట్టణంలోని 7 వార్డు గౌతమ ఆశ్రమ పాఠశాల వెనుకాల ఉన్న కాలనీ వాసులు బురదమయంగా మరీనా రోడ్డుతో అవస్థలు పడుతున్నారు. సుదీర్ఘ కాలంగా మురికి కాలువలతో సతమతమతం అవుతున్న ఈ కాలనీ ప్రజలు వర్షాకాల సీజన్ లో రోడ్డు దుస్థితిపై ఎవరు స్పందించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. వార్డు పాలకులు మారుతున్న కాలనీ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మొన్నటి వర్షం వల్ల రోడ్డుపై కుంటాను తలపించగా మురికి కాలువ ఒడ్డున నడుస్తూ, వాహన చోదకులు మరోదారిన వెళ్లే పరిస్థితి నెలకొంది. రాత్రి వర్షంకు ఇప్పుడు రోడ్డుపై చెరువును తలపిస్తున్న పాలకులు పట్టించుకోకపోవడపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ పాలకులు,  అధికారులు చర్యలు చేపట్టకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని వార్డు ప్రజలు హెచ్చరిస్తున్నారు.

హరితహారం మొక్కలు ఏమయ్యాయి…

- Advertisement -

రోడ్డు పక్కన ఉన్న ఓ వైద్యుని కాలి స్థలం చదును చేసుకునే పనిలో గత హరితహారంలో నాటిన దాదాపు 40 మొక్కలు మట్టిలో కలిసిపోయాయి. నాటడమే కాదు సంరక్షణ బాధ్యత కూడా అధికారులు, ప్రజాప్రతినిధులదే అని అటు ప్రభుత్వం చెప్పిన ఎవరు కూడా వాటి స్థానంలో నాటించేందుకు ప్రయత్నిం చేయడం కాదు కదా తన పని పూర్తి చేసుకున్న వైద్యుడు అతని సొంత స్థలం వైపు కూడా రాలేదని ఆరోపణలు వినవస్తున్నాయి. హరితహారం మొక్కల విషయం ను పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిది కానీ మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకోలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ప్రస్తుతం రోడ్డు సమస్యపై సమాచారం అందించాలని కాలనీ వాసులు ప్రయత్నాలు చేసిన ఉన్న కమిషనర్ నుండి ఏ మాత్రం స్పందన లేదని కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:On the way to the colony …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page