టీచర్ కృషికి జాతీయ అవార్దు

0 1

అనంతపురం ముచ్చట్లు:

 

కరోనా పాండమిక్ సమయంలో పిల్లలు చదువుకు దూరం అవ్వుతున్నారని ఒక టీచర్ వినూత్నమైన బోధన పద్ధతికి శ్రీకారం చుట్టారు. దీంతో పిల్లలుతోపాటు తల్లిదండ్రులు ఆ టీచర్ కు ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఆ టీచర్ చేసిన కృషికి  ఇప్పుడు జాతీయ అవార్డు కు ఎంపిక అయ్యారు.
అనంతపురం  జిల్లా పాలసముద్రం పాఠశాల బయాలజీ ఉపాధ్యాయురాలు మంజులకు   జాతీయ అవార్డు లభించింది. 2018-19 సంవత్సరాలకు ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (ఐసీటీ) అవార్డులకు ఎంపిక చేశారు. జాతీయస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, విద్యార్థులకు సాంకేతికత ద్వారా బోధన చేసేవారికి అవకాశం కల్పించారు. అందులో గోరంట్ల మండలం పాలసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజీ పాఠశాల సహాయకురాలు మంజులకు అవార్డు దక్కింది. ఆమె కొవిడ్ కంటే ముందు నుంచే సాంకేతిక అంశాలను ఉపయోగించి విద్యార్థులకు బోధన చేరువ చేశారు. 2019 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 24 మందికి అవార్డు దక్కగా అందులో మంజుల ఉండటం జిల్లాకు గర్వకారణమని స్థానికులు అంటున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: National Award for Teacher Work

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page