దిశ….మహిళలకు ఒక మార్గదర్శి

0 6

తుగ్గలి  ముచ్చట్లు:
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు దిశ యాప్ ను ఆచరణలోకి తీసుకొని వచ్చారని తుగ్గలి యస్.ఐ షామీర్ భాష తెలియజేశారు.ఫిబ్రవరి 2020 న రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ ను ప్రారంభించిందని ఆయన తెలియజేశారు. శుక్రవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు స్థానిక పోలీసు సిబ్బందితో మరియు గ్రామ మహిళా సచివాలయ కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దిశ యాప్ పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై షామీర్ భాష మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దిశ యాప్ పై గ్రామంలోని ప్రతి మహిళకు అవగాహన కల్పించాలని మహిళా పోలీస్ కార్యదర్శులకు ఎస్సై తెలియజేశారు.దిశ యాప్ ను ఇంటర్నెట్ ద్వారా ప్లేస్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవాలని,దిశ యాప్ వినియోగానికి ఎటువంటి ఇంటర్నెట్ సౌకర్యం అవసరం లేదని ఆయన తెలియజేశారు.ప్రస్తుత పరిస్థితులలో మహిళలు ఏమైనా ఆపదలో ఉన్నప్పుడు దిశా యాప్ లో ఉండే సేవలను వినియోగించి తమను తాము రక్షించుకోవడం అని ఎస్.ఐ తెలియజేశారు.మహిళలు ఏవైనా ఆపదలో ఉన్నప్పుడు దిశ యాప్లోని ఎస్.ఓ.ఎస్ (సేవ్ అవర్ సిస్టర్స్) బటన్ను నొక్కడం ద్వారా సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం వెళ్తుంది,ఎస్.ఓ ఎస్ బటన్ ను నొక్కినప్పుడు సంఘటనా స్థలం వద్ద వీడియో,ఆడియో చిత్రీకరణ ఆటోమేటిక్ గా జరుగుతుందని, అనంతరం లొకేషన్ ఆధారంగా పోలీసులు త్వరగా సంఘటనా స్థలానికి చేరుకొని ఆపదలను అడ్డుకుంటారని ఎస్.ఐ తెలియజేశారు.చెవిటి మరియు మూగ మహిళల సౌకర్యార్థం దిశ యాప్ ను ఓపెన్ చేసి గట్టిగా మూడు సార్లు కుదపడం ద్వారా కూడా సంబంధిత సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం వెళ్తుందని ఎస్ఐ తెలియజేశారు.దిశ యాప్ ద్వారా మహిళలకు ఎంతో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని,దిశా యాప్ ద్వారా అత్యవసరమైన మెడికల్,ఫైర్ తదితర వంటి సేవలను కూడా ఈ యాప్ ద్వారా వినియోగించుకోవచ్చని ఎస్సై షామీర్ భాష తెలియజేశారు.కావున మహిళలు దిశ యాప్ ను వినియోగిస్తూ,మరో నలుగురు మహిళలకు సమాచారం అందించాలని ఎస్ఐ షామీర్ భాష తెలియజేశారు.దిశ యాప్ ద్వారా కేసు నమోదైతే నిందితుడిపై 14 రోజుల్లో విచారణ నిర్వహించి,21 రోజులలోపు శిక్షను ఖరారు చేస్తారని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మాధవ స్వామి,తుగ్గలి పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు సుశీల, ఆదిలక్ష్మి మరియు గ్రామ మహిళా సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

- Advertisement -

Tags:Direction …. a guide for women

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page