పోలవరం నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి

0 21

చింతూరు  ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా చింతూరు డివిజన్ ముంపు మండలాల్లో జాతీయ ఆదివాసీ అఖిలపక్ష సంఘం పర్యటించింది. పోలవరం ముంపు గురవుతున్న నిర్వాసితులకు ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ముంపుకి గురవుతున్న ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అలానే 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇవ్వలి. పెళ్లికాని యువతులుకు 20 లక్షలు ఇవ్వాలి. నిర్వాసితుల అందరికి ప్యాకేజీ అందించి తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణం చేయాలని అఖిలపక్ష డిమాండ్ చేసింది. ప్రతి కుటుంబానికి 5 ఎకరాల పొలం మరియు 50 లక్షలు పరిహారం చెల్లించాలి. జాతీయ ఆదివాసీ చట్టల ప్రకారం భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అఖిల పక్ష సంఘంలో  సీపీఎం, సీపీఐ టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీ ల నాయకులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర నాయకులు జ్యోతుల నెహ్రు.జనసేన రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఆదివాసీ సంఘం జాతీయ కన్వీనర్ చందా లింగయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం  జరిగింది.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

- Advertisement -

Tags:Polavaram residents should be given a better package

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page