ప్రజా సమస్యలు పరిష్కరించడానికే పోలీస్ స్టేషన్లు… ఎస్సై షామీర్ భాష

0 14

తుగ్గలి  ముచ్చట్లు:
ప్రజా సమస్యలు పరిష్కరించడానికే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్దిష్ట నియమ నిబంధనలను ఏర్పాటు చేసి ప్రజల కొరకు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశాయని తుగ్గలి ఎస్ఐ షామీర్ భాష తెలియజేశారు.శుక్రవారం రోజున విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ సమాజంలో ఏర్పడ్డ ఎటువంటి సమస్యలైనా పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలే గాని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎవరు ప్రోత్సహించరాదని ఆయన తెలియజేశారు.అదేవిధంగా గ్రామాలలో జరిగే అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేలా ప్రజలు సహకరించాలని ఆయన తెలియజేశారు.గ్రామాలలో సారా,మట్కా,పేకాట మరియు బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే తమకు సమాచారం ఇవ్వాలని,వారి పేర్లను గోప్యంగా ఉంచి సంఘ విద్రోహ శక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలు ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన ప్రజలకు తెలియజేశారు.ప్రజల సమస్యల పరిష్కరించడానికి ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎస్సై షామీర్ భాష తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

- Advertisement -

Tags:Police stations to solve public problems …
Essay Shamir Language

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page