ప్రైవేట్ ఏజెన్సీలకు కేటాయించడంపై వివాదం

0 12

తిరుమల  ముచ్చట్లు:

తిరుమలలో ఉచిత సేవలను ప్రైవేట్ ఏజెన్సీలకు కేటాయించడంపై వివాదం రేగుతోంది. బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అందిస్తున్న సేవలను ఏజెన్సీలకు కట్టబెట్టడంపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను వివాదాలకు, వివాదాస్పద నిర్ణయాలకు కేంద్రంగా మార్చేస్తున్నారని.. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో జాతీయ బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు ఆధ్యాత్మిక, సేవా దృక్పథంతో భక్తులకు ఉచితంగా పలు సేవలను అందించేవని.. అందువల్ల టీటీడీపై ఒక్క పైసా భారం ఉండేది కాదని చంద్రబాబు అన్నారు. ఎంతో మంది భక్తులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారి ఉచిత దర్శనాన్ని పొందే వీలుండేదన్నారు. అలాంటి స్వచ్చంద, ఉచిత సేవలు అందిస్తున్న వారిని తప్పించడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.లడ్డూ వితరణ, కల్యాణ కట్ట, దర్శన టికెట్ల స్కానింగ్ వంటి సేవలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం సబబు కాదని చంద్రబాబు అన్నారు. పవిత్ర పుణ్య క్షేత్రంలో వ్యాపార బీజాలు నాటడమేంటని ఆయన ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తి కాకపోతే సజావుగా బ్యాంకులు, శ్రీవారి సేవకుల ద్వారా సాగిపోతున్న ఉచిత సేవలను కాదని ఎదురు చెల్లింపులు చేయడమేంటని ఆయన నిలదీశారు.
బాబు మండిపాటు

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Controversy over allocation to private agencies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page