వేగవంతంగా జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు

0 9

తుగ్గలి ముచ్చట్లు:

 

మండల కేంద్రమైన తుగ్గలి లోని బీసీ కాలనీ సమీపంలో జగనన్న ఇళ్ల నిర్మాణ గ్రౌండింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.తుగ్గలి విఆర్ఓ నాగేంద్ర పర్యవేక్షణలో బీసీ కాలనీ నందు జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నాయి. గురువారం రోజున మండల అధికారుల ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణ పనులకు అధికారులు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా వీఆర్వో నాగేంద్ర మాట్లాడుతూ బీసీ కాలనీ నందు కేటాయించిన స్థలంలో 94 మంది లబ్ధిదారులకు సంబంధించి గ్రౌండింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగా 80 మంది లబ్ధిదారులకు సంబంధించి జియో ట్యాగింగ్ కూడా పూర్తి చేసినట్లు ఆయన తెలియజేశారు.జగనన్న ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి 95 శాతం గ్రౌండింగ్ పనులు పూర్తి అయినట్లు వీఆర్వో నాగేంద్ర తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు,లబ్ధిదారులు,గ్రామ వాలంటీర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Rapid construction of Jagannath houses

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page