శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న ఉత్పత్తి

0 7

కర్నూలు ముచ్చట్లు :

 

శ్రీశైల ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. డ్యాం నుంచి 35 వేల 300 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో విడుదల చేసిన నీరు నేరుగా సాగర్ జలాశయానికి చేరుకుంటుంది. ప్రస్తుతం శ్రీశైల జలాశయం నీటి మట్టం 821.05 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో 42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అయితే కేఆర్ఎంబీ ఆదేశాలను పట్టించుకోక పోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తోంది. శ్రీశైలంలో 835 అడుగుల నీటిమట్టం ఉంటేనే విద్యుదుత్పత్తి చేయాలని.. ఎడమగట్టులో 810 అడుగులకే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని ఎస్‌ఈ వెంకటరమణయ్య అన్నారు. నాగార్జునసాగర్ కింద అత్యవసరమైతే శ్రీశైలం నుంచి నీటిని వినియోగించవచ్చు. కానీ ప్రస్తుతం సాగర్ కింద నీటి ఇబ్బంది పరిస్థితులు లేవు.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Ongoing production at Srisailam Left Bank Power Station

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page