సిటీలో ఇక స్మార్ట్ మీటర్లు షురూ…

0 15

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

స్మార్ట్ మీటర్లు జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో బిగించారు. ఈ విధానం వల్ల విద్యుత్ రంగంలో పూర్తి పారదర్శక సేవలు వినియోగదారులకు అందనున్నాయి. ఇదిలావుంటే.. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగం విషయంలో ఏ కొత్త విధానాన్ని తీసుకురావాలన్నా.. తెలంగాణ ప్రాంతాన్నే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుంటుంది. అందులో భాగంగానే స్మార్ట్ గ్రిడ్ పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్ల పైలట్ ప్రాజెక్టును జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో చేపట్టారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.41.82 కోట్లను కేటాయించింది.ఇందులో 50 శాతం గ్రాంటును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పథకంలో ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్టులో 42వేల స్మార్ట్‌మీటర్లు బిగించాలని తెలంగాణ విద్యుత్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పటివరకు 18882 గృహ వినియోగదారులకు మీటర్లను బిగించారు. త్వరలోనే 3024 పారిశ్రామిక వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనున్నారు.ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన మీటర్ల బిల్లింగ్‌లో లోపాల కారణంగా వినియోగదారులతో పాటు విద్యుత్ శాఖకు సైతం నష్టం వాటిల్లేది. మాన్యువల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రోరల్ మీటర్లపైనా వినియోగదారుల్లో అపోహలు ఉండేవి. వీటికితోడు టెలిస్కోపిక్, నాన్‌టెలిస్కోపిక్ విధానం వల్ల బిల్లింగ్‌లో శ్లాబులు మారి హెచ్చుతగ్గులు ఉండేవి. దీంతో బిల్లుల జారీపై స్పష్టత ఉండేది కాదు. ఒక్కోసారి త్వరగా రీడింగ్ తీయడం వల్ల సంస్థకు నష్టం వాటిల్లేది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల రీడింగ్ సిబ్బంది (మ్యాన్‌పవర్) లేకుండా నెలనాడు బిల్లు ఆటోమెటిక్‌గా వినియోగదారుడికి మొబైల్‌కు సందేశం వస్తుంది. ఈ బిల్లుల జారీకి ఎలాంటి సిబ్బంది అవసరంలేదు. తక్కువ ఎక్కువ రోజులనే గందరగోళం అసలే ఉండదు. వినియోగదారుడికి నెలనాడు ఏలాంటి లోపాలు లేకుండా కచ్చితమైన బిల్లింగ్ అందుతుంది.

 

 

 

 

- Advertisement -

ఫలితంగా ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో మీటర్ రీడింగ్ కోసం స్కిల్డ్ లేబర్‌ను వినియోగించాల్సి వస్తుంది. ఫలితంగా విద్యుత్ సరఫరా విషయంలో సిబ్బందిపై భారం పడుతుంది. కానీ స్మార్ట్ మీటర్ల విధానంలో మ్యాన్‌పవర్ అవసరం లేకపోవడంతో స్కిల్డ్ లేబర్‌ను పూర్తిగా విద్యుత్ సరఫరాకే వినియోగించుకునే అవకాశం విద్యుత్ శాఖకు కలిగింది.వినియోగదారులు కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకునే సమయంలో విద్యుత్ శాఖతో ఎన్ని కిలోవాట్ల లోడు వినియోగిస్తారనే దానిపై ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. లోడు వినియోగం పెరిగితే.. దాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. కానీ వినియోగదారులు అదనపు లోడు పడినా.. క్రమబద్ధీకరించుకోరు. ఫలితంగా ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు, ఫీడర్లపై భారంపడి మరమ్మతులకు గురవుతుంటాయి. అయితే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అదనపు ఎంత పడుతుంది ? ఎక్కడ పడుతుంది? అనే పూర్తి వివరాలు వినియోగదారులతో పాటు విద్యుత్ సంస్థకు సందేశం ద్వారా చేరుతుంది. ఫలితంగా విద్యుత్ సంస్థ దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటుంది. వినియోగదారులకు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడదు. దీంతోపాటు వినియోగదారుడు విద్యుత్ వినియోగం హిస్టరీ మొత్తాన్ని ఈ మీటర్ల వల్ల తెలుసుకోవచ్చు. సెక్షన్ కార్యాలయం నుంచి సరఫరాకు సంబంధించిన సమస్త సమాచారం సులువుగా అందుతుంది.స్మార్ట్ మీటర్ల విధానంలో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మీటర్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికి పోస్ట్‌పెయిడ్ మీటర్లను మాత్రమే బిగించారు. భవిష్యత్తులో ఈ మీటర్‌ను ప్రీపెయిడ్‌గానూ వాడుకోవచ్చు. అయితే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారుడికి ఉపయోగాలు చాలా ఉన్నాయనే చెప్పాలి.

 

 

 

 

ప్రస్తుతం పోస్ట్‌పెయిడ్ మీటర్ల వల్ల నెల పూర్తయిన తర్వాత బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే మనం ఎంత విద్యుత్ వినియోగిస్తున్నామనే విషయం ఎప్పటికప్పుడు తెలిసే అవకాశం ఉండదు. విద్యుత్‌ను ఎక్కువగా వినియోగించిన పక్షంలో బిల్లు ఎక్కువరావడంతో మేం వినియోగించకుండానే బిల్లు ఎక్కువ వచ్చిందంటూ గాబరా పడిపోతుంటాం. అయితే స్మార్ట్ మీటర్ల ప్రీపెయిడ్ విధానంలో ముందుగానే రీచార్జి చేసుకోవడం.. ఎప్పటికప్పుడు ఎంత విద్యుత్‌ను వినియోగించాం.. ఇంకా ఎంత విద్యుత్‌ను మిగిలి ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. దాంతో ఒకటికీ రెండుసార్లు ఆలోచించి మరి విద్యుత్‌ను వినియోగిస్తాం. దాంతో బిల్లు ఎక్కువగా వస్తుందనే హైరానా ఉండదు.ఈ స్మార్ట్ మీటర్ల తయారీకి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 2016 సంవత్సరంలో ఈసీఐఎల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఈసీఐఎల్ సంస్థ స్మార్ట్ మీటర్ల తయారు చేయడంతో పాటు సర్వర్ మెయింటనెన్స్‌ను చూస్తుంది. దీంతో పాటు బెంగళూరుకు చెందిన సీపీఆర్‌ఐ సంస్థ ప్రాజెక్టు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags: Smart meters launched in the city …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page