అల్లూరి చిరస్మరణీయుడు _అల్లూరి జీవిత చరిత్ర తైలవర్ణ చిత్ర కళా ప్రదర్శన ప్రారంభించిన ఎంపి భరత్ రామ్

0 11

రాజమహేంద్రవరం ముచ్చట్లు:

విప్లవ జ్యోతి,  మహాయోథుడు అల్లూరి సీతారామ రాజు నిత్య స్మరణీయుడని రాజమహేంద్రవరం ఎంపి,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు.  అల్లూరి 125వ జయంతి వారోత్సవాల సందర్భంగా స్థానిక దామెర్ల ఆర్టు గ్యాలరీలో ఏర్పాటు చేసిన అల్లూరి జీవిత చరిత్ర, తైలవర్ణ చిత్ర కళా ప్రదర్శనను  ఎంపి భరత్ రామ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఎంపి భరత్ రామ్ అల్లూరికి ఘన నివాళులర్పించారు.
ఎంపి, మాట్లాడుతూ ఈ చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేసిన జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం, మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీలను అభినందించారు.  రాజమహేంద్రవరం కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపజేసే విధంగా పాతరైలు వంతెనను రహదారి మార్గంగా అభివృద్ధి చేస్తామన్నారు.  పార్లమెంటు ప్రాంగణంలో కూడా అల్లూరి విగ్రహం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
మహా యోథుడు అల్లూరి బాల్యంలో రాజమహేంద్రవరంలో గడపడం మనకు ఎంతో గర్వకారణమని,  అటువంటి వారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.  అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 1నుంచి 7వ తేదీ వరకూ వారోత్సవాలను ఘనంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న అల్లూరి సీతారామరాజు యువజన సంఘాన్ని,  మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ లను ఎంపి భరత్ రామ్ అభినందించారు.  పాత రైలు వంతెన కు అల్లూరి  పేరు పరిశీలిస్తామని అన్నారు.
తొలుత అల్లూరి చిత్ర పటానికి ఎంపి భరత్ రామ్,  రాజమహేంద్రవరం రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, పడాల వీరభద్రరావు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కోశాధికారి బళ్లా శ్రీనివాస్,  ఉపాధ్యక్షుడు పుచ్చల రామకృష్ణ,  ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వంకా నాగేశ్వరరావు,  గంగరాజు,  సీత, ఎబి కృష్ణ శర్మ,  రాజమండ్రి వైసీపీ పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి కాను బోయిన సాగర్, వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి , మజ్జి అప్పారావు,  మారిశెట్టి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Alluri Memorable _Alluri Biography
MP Bharat Ram inaugurated the oil painting exhibition

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page