ఆగస్టు వరకు నాకు టైమ్ ఉంది

0 19

గుంటూరు  ముచ్చట్లు:

నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్సీల పదవి కాలం పూర్తయిపోయిందని.. అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీలు తమ ఎమ్మెల్సీ కాలం పూర్తి కాలేదని.. న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు ఇచ్చారు. రేపో మాపో హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అదెలా సాధ్యమంటే.. కరోనా కారణంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రకటన చేసింది. ఎన్నికల కమీషన్ పేర్కొన్న ఆ ప్రకటనలో.. రిటైర్మెంట్ కు సంబంధించిన అంశం ఉంది. ప్రస్తుతం రిటైర్ కావాల్సిన ఎమ్మెల్సీలు ఆగస్టు11 వతేదీన రిటైర్ అవుతారన్న అర్థంలో ఆ నోటిఫికేషన్ ఉందని రిటైరైన టీడీపీ ఎమ్మెల్సీలు అంటున్నారు. ఆ నోటిఫికేషన్ డాక్యుమెంట్లతో సహా ప్రస్తుతం వారు అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించకపోతే కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నలుగురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పార్టీ లీగల్ సెల్ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. సాధారణంగా.. ఖాళీఅయ్యే ఎమ్మెల్సీ సీట్లను.. .వెంటనే భర్తీ చేస్తారు. ఖాళీగా ఉండటానికి అవకాశం లేదు. శాసనమండలి శాశ్వత సభ. అదే సమయంలో ఎన్నికల విషయంలో రాజ్యాంగపరమైన హక్కులు ఉన్న ఎన్నికల కమిషన్ కూడా ఎమ్మెల్సీ రిటైర్మెంట్ విషయంలో… కొన్ని సూచనలు చేసింది. అవి పాటించాల్సి ఉంది. సాంకేతికంగా అయితే ఇప్పటికే.. వారి పదవీ కాలం ముగిసింది. కానీ ఎన్నికల సంఘం తమ రిటైర్మెంట్ కు ఇంకా గడువు ఇచ్చిందంటూ వారు న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నారు. ఎన్నికల సంఘం దృష్టికిఈ విషయం వెళ్లి.. పొరపాటు జరిగిందని సవరించుకుంటే.. ఈ టీడీపీ ఎమ్మెల్సీల ఆశలు గల్లంతయినట్లే. కాదు మళ్లీ ఎన్నికలు జరిగే వరకూ.. వాళ్ల పదవి ఉంటుందటే… కాలం కలసి వచ్చినట్లే.

 

- Advertisement -

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:I have time until August

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page