నల్లారి కిశోర్ రెడ్డిపై ఎన్‌ఫో ర్స్ మెంట్‌ డిపార్ట్మెంట్‌ అధికారులు దాడికి సిద్ధం

0 160

పీలేరు ముచ్చట్లు:

 

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, తెలుగుదేశం పార్టీ పీలేరు నియోజకవర్గ ఇంచార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అక్రమ ఆస్తులపై సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మరియు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు దాడికి సిద్ధమైనట్టు సమాచారం. కిషోర్ రెడ్డి సోదరుడు కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన జరిపిన అక్రమ లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ మరియు ఇన్కమ్ టాక్స్ అధికారులు రహస్య విచారణ చేపట్టి ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
ఆయన సోదరుడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పట్లో ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ DEC ఇన్ఫ్రా కంపెనీ నుండి కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని వినికిడి.కిషోర్ రెడ్డి కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను ఆయన భార్య,ఆయన కుమారుడు బ్యాంకులకు మళ్లించారని సమాచారం.కిషోర్ సోదరుడు ముఖ్యమంత్రి కాక ముందు ఎంత ఇన్కమ్ టాక్స్ కట్టేవారు..సోదరుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎంత ఇన్కమ్ టాక్స్ కడుతున్నారు అనే కోణంలో కూడా విచారం జరిపినట్లు తెలుస్తోంది.
హైదరాబాదులో కిశోర్ రెడ్డి భార్య తనూజ రెడ్డి పేరు మీద కోట్ల విలువ చేసే విలాసవంతమైన ఇల్లు,చెన్నై,బెంగళూరులలో కుమారుడు అమరనాథ్ రెడ్డి పెరు మీద ఉన్న హైటెక్ భవనాలను చూసి అధికారులే ఒక వంతు ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది.

 

 

 

- Advertisement -

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పీలేరు పరిసర ప్రాంతాలలో వందలాది ఎకరాలు భూకబ్జాలు చేసినట్లు పక్కా ఆధారాలు సేకరించినట్లు,అందుకు సహకరించిన రెవిన్యూ అధికారుల చిట్టా కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.కలికిరి సమీపంలో సెజ్ పేరుతో విలువైన భూములను తన బినామిల పేరుతో పెట్టి కోట్లాది రూపాయలు ఆర్జించిన ఆధారాలు లభ్యం అయినట్లు సమాచారం. కలికిరిలో JNTU, సైనిక్ స్కూల్స్ నిర్మాణాలలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల నుండి 22% కమిషన్లు వసూలు చేసారని ఓ కాంట్రాక్టర్ పిర్యాదు కూడా చేసారంట.ఈ కమీషన్లను కిశోర్ కుమార్తె వైష్ణవికి కానుకగా ఇచ్చారట.
ఇదిలా ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భారీ స్థాయిలో  ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి కోట్లాది రూపాయలు కిషోర్ రెడ్డి,ఆయన భార్య ఖాతాలో చేరాయని దీనిపై SEB అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

 

 

 

ఎటువంటి సోర్స్(ఆధారం) లేకుండా,వ్యాపారాలు లేకుండా వందల కోట్లకు పడగ ఎత్తిన కిషోర్ రెడ్డి,ఆయన భార్య,కుమారుడు ఆస్తులు,భూములను ఈడీకి అటాచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పక్కా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని విచారణ చేపడుతోందని ఓ రాష్ట్ర స్థాయి అధికారి తెలిపారు.ఏ క్షణాన అయిన కిశోర్ కుమార్ రెడ్డి,ఆయన భార్య,కుమారుడుపై ED, income tax అధికారులు దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బోగట్టు.ఏ క్షణాన ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే..?

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Enforcement officials prepare to attack Nallari Kishore Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page