పుంగనూరులో జగనన్నకాలనీలలో పనులు వేగవంతం-స్పెషలాఫీసర్‌ రాజశేఖర్‌నాయుడు

0 38

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వం ఆదేశించిన మేరకు జగనన్నకాలనీలలో ఇండ్ల నిర్మాణాల మేళా చురుగ్గా సాగుతున్నట్లు ఎస్‌ఈ కార్పోరేషన్‌ ఈడి, స్పెషలాఫీసర్‌ రాజశేఖర్‌నాయుడు తెలిపారు. శనివారం ఆయన మండల కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌వో మాట్లాడుతూ నియోజకవర్గంలోని మున్సిపాలిటితో పాటు ఆరు మండలాల్లోను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు జగనన్నకాలనీలలో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2,637 ఇండ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారన్నారు. అలాగే సచివాలయాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, మిల్క్ చిల్లింగ్‌ సెంటర్లు, ఆర్‌బికెలు దాదాపుగా పూర్తికావస్తోందన్నారు. 8న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. లబ్ధిదారులు సైతం తమంతకు తాముగా ఇండ్లు నిర్మించుకునేందుకు అధిక సంఖ్యలో రావడం జరుగుతోందన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు నిర్మాణాలు పూర్తి చేసి, గృహప్రవేశాలు నిర్వహిస్తామన్నారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Things speed up in Jagannath Colony in Punganur-Specialist Rajasekhar Naidu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page