పేదల సొంతింటి కల నేరవేర్చడమే జగనన్న ధ్యేయం , ఎమ్మెల్యే  ఎర్రకోట చెన్నకేశవరెడ్డి  వెల్లడి

0 15

ఎమ్మిగనూరు  ముచ్చట్లు:
రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి  సొంతింటి ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సొంతింటి కలను సాకారం చేస్తున్నారని ఎమ్మిగనూరు శాసన సభ్యులు  ఎర్రకోట చెన్నకేశవరెడ్డి   పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని కలుగట్ల గ్రామంలో నవరత్నాల- పేదలందరికీ కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలకు భూమి పూజ చేసారు.  ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ  ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో నిలువ నీడలేని ఎంతో మంది పేదల కష్టాలను కళ్లారా చూసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతి పేదవాడికీ సొంతిల్లు నిర్మించి ఇచ్చేందుకు పూనుకున్నారని కొనియాడారు. జగనన్న కాలనీలో ఏకంగా ఊర్లే నిర్మిస్తున్న జగనన్న ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమం తో ముందుకు పోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ బంగారమ్మ, , తహశీల్దార్ జయన్న, హౌసింగ్ డిఈ సంజీయ్ రాయుడు,  స్పెషల్ ఆఫీసర్ సుధాకర్, రూరల్ ఎస్సై సునీల్ కుమార్, కలుగట్ల సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకులు రఘుకుమార్ రెడ్డి, అబ్రహం, ధర్మాకారి నాగేశ్వరరావు, సయ్యద్ చాంద్, రాజారెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

- Advertisement -

Tags:Jagannath’s goal is to fulfill the dream of the poor, says MLA Errakota Chennakeshavareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page