రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతి

0 14

విజయవాడ ముచ్చట్లు:

శనివారం ఏపీలో జరిగిన రెండు వేరు వేరే రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరుమృతి చెందారు.  ప్రకాశం జిల్లా.కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో  కనిగిరి ఇందిరా కాలనీకి చెందిన తిప్పలూరు సుబ్బారెడ్డి (45) మృతి చేందాడు. కనిగిరి పట్టణం నుండి కొత్తూరు మోటార్ సైకిల్ పై వెళుతుండగా కనిగిరి నుండి పామూరు వెళ్తున్న ట్రాన్స్ పోర్ట్ వాహనం వెనుక భాగం తగలడంతో సుబ్బారెడ్డి  అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై రామిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.  మరోఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగింది.  చంద్రగిరి మండలం, నాగయ్యగారిపల్లె వద్ద తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిలో అదుపు రోడ్డు పక్కన చెట్టును కారు ఢీ కొట్టింది.  దాంతో కారులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి మృతురాలు తిరుపతి సప్తగిరినగర్ కి చెందిన బసవమ్మ(55)గా గుర్తించారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Two were killed in two separate road accidents

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page