కారుణ్య మరణం కోరిన వృద్ధురాలు

0 21

బెంగళూరు ముచ్చట్లు :

 

భర్త వేధిస్తున్నారని శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేస్తు న్నారని 61 ఏళ్ళ వృద్ధురాలు కారుణ్య మరణం కోరారు. కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా కందకూరు గ్రామానికి చెందిన ఈరమ్మ నింగప్ప కుర్నాళ అనే వృద్ధురాలు స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులను ఆశ్రయించారు. భర్త వేధింపులు తట్టుకో లేక పోతున్నానని శుక్రవారం ఇంటిని వీడిని ఈరమ్మ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో గడిపారు. స్థానికులు భోజనం సమకూర్చారు. ఇదే విషయమై ఈరమ్మ మీడియాతో మాట్లాడుతూ భర్త రెండో వివాహం చేసుకున్నారన్నారు. నాకు ఇరువురు పిల్లలు ఉ న్నారని ఆస్తిని పంచాలని కోరినందుకు ఇంటినుంచి గెంటి వేశారన్నారు. భర్త నింగప్ప వేధింపుల నుంచి త ట్టుకోలేక పోతున్నానని పేర్కొన్నారు. కారుణ్య మరణానికి సంబంధించి ఎటువంటి దరఖాస్తు రాలేదని అయినా అంశం మా పరిధిలోకి రాదని శుక్రవారం అటు వంటి ఫిర్యాదు వచ్చి ఉంటే పరిశీలించి ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: An old woman seeking a compassionate death

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page