చౌడేపల్లెలో రూ:1.05 కోట్ల తో పోలీస్‌, సర్కిల్‌ స్టేషన్‌ల నిర్మాణాలకు భూమిపూజ

0 115

-30 యేళ్ల నాటి పక్కాభవనం కల నెరవేరనుంది
– మండల ్యభివృధ్దే మంత్రి పెద్దిరెడ్డి ధ్యేయం
– హాజరైన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి


చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

సుమారు 30 యేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతున్న పోలీస్‌ స్టేషన్‌కు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొవరతో రూ:1.05 కోట్లతో దొరబావి తోట వద్ద గల కోనేరు వద్ద పక్కాభవనాల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి హాజరై గణపతి పూజ నిర్వహించి ,పనులు ప్రారంభించారు. జెడ్పిటీసీసభ్యుడు , కాంట్రాక్టర్‌ దామోదరరాజు ఆధ్వర్యంలో భవన నిర్మాణపనులు నిర్వహిస్తున్నామని, త్వరగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని పెద్దిరెడ్డి ఆయన్ను కోరారు. ఈ సంధర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ 30 యేళ్లుగా పోలీస్‌ స్టేషన్‌ అద్దె భవనంలో నేటికూ కొనసాగిస్తున్నారన్నారు. సర్కిల్‌ కార్యాలయం కూడా అద్దె భవనంలో నిర్వహిస్తున్నారని, మంత్రి పెద్దిరెడ్డి చొరవతో నిధులు మంజూరు చేయించారన్నారు. ఎట్టకేలకు ఆనాటి కళ నేటితో నెరవేరడానికి పునాది పడిందన్నారు. అలాగే స్థలాన్ని డాక్టర్‌ మురళీ నాయుడు ధాతృత్వంతో పాటు దామోదరరాజు సహకారంతో సరిపడా స్థలం సేకరించారన్నారు.

 

 

మండలంలో సుమారు 3కోట్ల నిధులతో ఎంపీడీఓ, తహసీల్దార్‌ కార్యాలయాలకు పక్కాభవనాలు నిర్మాణపనులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. మండలాభివృద్దిపై మంత్రి దృష్టి సారించారని, దశలవారీగా మౌళిక వసతుల అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గ్రామాలతోపాటు శిథిలావస్థకు చేరువలో గల ఆలయాల అభివృద్దికోసం దృష్టి పెట్టామన్నారు. అనంతరం దామోదరరాజు ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి, డాక్టర్‌ మురళీ నాయుడు ను సన్మానించి బహుమతిను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీపీ మెంబరు అంజిబాబు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుసూధనరెడ్డి,బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు రామమూర్తి,బూత్‌ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి,కడియాల నగేష్‌, సోమల మల్లికార్జునరెడ్డి,మిద్దింటి కిషోర్‌బాబు, ఏఎంసీ చైర్మన్‌ నాగేశ్వరరావు, సర్పంచ్‌లు వరుణ్‌,రఘునాథరెడ్డి, ఎంపీటీసీ నరసింహులుయాదవ్‌, పీఎంసీ కమిటి చైర్మన్‌ అల్తాఫ్‌, రఘుస్వామి, చెంగారెడ్డి,రమణ,మణికంఠ,విఆర్వో మల్లికార్జునరెడ్డి తదితరులున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Bhumipuja for construction of police and circle stations at Rs. 1.05 crore in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page