జగనన్న కాలనీల గృహ నిర్మాణ పనులపై సమీక్షించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

0 22

తిరుపతి ముచ్చట్లు:

 

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో వైఎస్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ పనులపై ఆదివారం ఎస్వీయూ సెనేట్ హల్ వేదికగా సమీక్షించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సమీక్షలో ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ.చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో యుద్ద ప్రాతపదికన నిర్మాణాలు సాగాలి. గ్రామాలుగా ఏర్పాటు అవుతున్న వైఎస్ జగనన్న కాలనీలలో మొదటి విడతగా ఆమోదం లభించిన 11,407 గృహ నిర్మాణాలు 90 రోజుల్లో పూర్తి కావాలి. అలాగే ఇంటి పట్టాలు పొందిన 5,197 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేసుకునేలా చొరవ తీసుకోవాలి. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఇళ్ళ నిర్మాణం జరుగుతున్న నియోజకవర్గాల్లో చంద్రగిరి ఒకటి. రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా గృహ నిర్మాణాలు పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో చంద్రగిరి నియోజకవర్గం ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేయాలి. ప్రతి వెయ్యి గృహ నిర్మాణాలకు డివిజనల్ స్థాయి అధికారికి, 115 గృహ నిర్మాణాలకు మండలస్థాయి అధికారి, 50 గృహాలకు గ్రామ స్థాయి అధికారులు, 25 గృహాలకు ఒక వాలంటీర్ పర్యవేక్షణ. అధికారుల నిరంతర పర్యవేక్షణతో 90 రోజుల్లో గృహ నిర్మాణాలు పూర్తి చేయవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు నిర్మాణాలు సాగాలి. గృహ నిర్మాణాలలో నిబంధనలు అతిక్రమించకుండా సంబంధిత అధికారి నిరంతరంగా పర్యవేక్షించాలి. గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, ఇటుక సమీపం నుంచి తరలించుకునేందుకు అవకాశాలు చూడాలన్నారు. రోడ్లు, డ్రైన్ లు గృహ నిర్మాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలి..

 

 

 

 

- Advertisement -

వైఎస్ జగనన్న కాలనీలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు కోన సీమను తలపించేలా మొక్కలు నాటనున్నట్లు తెలియజేశారు. ఈ బాధ్యతలను డ్వామా విభాగం చేపట్టాలి. వైఎస్ జగనన్న కాలనీలలో పార్కుల అభివృద్ధి చేపట్టాలి.. ప్రస్తుత వాతావరణం మొక్కలు పెరుగుదలకు అనుకూలం. వీధి లైట్లు ఏర్పాటు, సచివాలయం నిర్మాణం, తదితర మౌళిక సదుపాయాల కల్పనలో రాజీపడొద్దు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదు.. మీకు నిర్దేశించిన విధులు బాధ్యతగా నిర్వర్తించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తాం..: ఎమ్మెల్యే చెవిరెడ్డి నేరేడు, ఉసిరి, నారదబ్బ, కానగ, వేప, రావి, చింత, మారేడు, వెలగ వంటి మొక్కలు నాటాలని సూచించారు. ఈ సమీక్షలో తుడా వీసీ హరికృష్ణ, తిరుపతి సబ్ కలెక్టర్ కనకనరసా రెడ్డి, తుడా సెక్రటరీ లక్ష్మీ, ఎంపిడివో లు, తహశీల్దార్ లు, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ, తుడా, ఇతర విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: MLA Chevireddy reviewing the housing works of Jagannath Colonies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page