పీలేరును దోచేసిన కిషోర్‌కు విమర్శించే అర్హత లేదు- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఫైర్‌

0 520

– అన్న కిరణ్‌ అండతో కిషోర్‌ కోట్లు కూడబెట్టారు
– పీలేరుపై ప్రేమ ఎక్కడ..?
-మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపిస్తే ఊరుకోం

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

పీలేరు లో కొండలు, గుట్టలు, ప్రభుత్వ స్థలాలను దోచేసిన కిషోర్‌కుమార్‌రెడ్డి,అతని అనుచరులకుమంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంభాన్ని విమర్శించే అర్హత లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిపెద్దిరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ పీలేరులో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అండలతో భూములు కబ్జా చేశారని పత్రికల్లో,మీడియాలో అసత్య ఆరోణలు చేయడం తగదన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం ఇలాంటి నీఛ పనులు చేయమని ఏనాడు పోత్సహించరని గుర్తుచేశారు. మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి అండతో కిషోర్‌కుమార్‌రెడ్డి కోట్లు కూడ బెట్టారని, ప్రభుత్వ ఆస్తులతోపాటు శేషాచలం కొండల్లో ఎర్రచందనంను అప్పణంగా దోచేశారన్నారు. ప్రతి పనికి, ప్రాజెక్టులకు పర్సంటేజీలు చొప్పున కోట్లాది రూపాయలు వసూలు చేసి పొరుగు రాష్ట్రలైన కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల్లో విశాలమైన భూములు, భవనాలు ఏర్పాటుచేశారన్నారు. అన్న పేరును అడ్డంపెట్టుకొని ప్రభుత్వ ఆస్తులను ధ్వసం ఆక్రమించుకొని , ఇప్పుడేమో వైఎస్సార్‌సీపీ నేతలపై అంటగట్టండం ఏమిటని ప్రశ్నించారు. సంస్కారంలేని , మానవతా విలువలు లేని కిషోర్‌కుమార్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని,లేకుంటే తగినరీతిలో గుణపాఠం చెప్పాల్సి వస్తోందని హెచ్చరించారు.

 

 

 

పీలేరుపై ఎక్కడ ఉంది ప్రేమ అంటూ ఎద్దేవా చేశారు. సైనిక్‌స్కూల్‌, సీఆర్‌ఫిఎఫ్‌ బెటాలియన్‌ శిక్షణా కేంద్రం, తదితర అభివృధ్ది వెహోత్తం కలికిరిలోనే చేశారు కానీ పీలేరు అభివృద్దిపై ఎందుకు పట్టించు కోలేదని ప్రశ్నించారు. జిల్లాలోని కుప్పంలో చంద్రబాబు నాయుడు, పీలేరు లో కిరణ్‌కుమార్‌రెడ్డిలు సీఎంలు గా ఉన్నారే కానీ బాబు కుప్పంకు ఏమీచేశారో,. పీలేరులో కిరణ్‌రెడ్డి ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని, అందుకే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. ఆనాడు మీస్థాయి, మీ ఆస్తులు ఎంత …?ప్రస్తుతం ఎంత ఉందో ప్రజలకు బహిరంగా వెల్లడించాలని సవాల్‌ విసిరారు.మాట్లడే ముందు నీ చరిత్ర ఏంటో ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీపీ మెంబరు అంజిబాబు, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు,మండల పార్టీ అధ్యక్షుడు రామమూర్తి, సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి,బూత్‌ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, సర్పంచ్‌లు వరుణ్‌, ఓబుల్‌రెడ్డి, పిఏసీఎస్‌ డైరక్టర్‌ రమేష్‌బాబు,సుధాకర్‌రెడ్డి, రఘుస్వామి, గోవిందయ్య,రమణ, హనుమంతురెడ్డి తదితరులున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Kishore, who kidnapped Peeler, has no right to criticize YSSRCP state secretary Peddireddy Fire

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page