ఫిలిప్పీన్స్‌లో కుప్పకూలిన విమానం

0 16

మనీలా ముచ్చట్లు :

 

ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 95 మంది సైనికులతో వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ విమానం సీ-130 జోలో ద్వీపం వద్ద కుప్పకూలింది. ఈ ఘటనలో 17 మంది మరణించినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు 40 మందిని కాపాడినట్లు ఆ దేశ సాయుధ దళాల చీఫ్ సిరిలిటో సోబెజన వెల్లడించారు. మిగతా జవాన్ల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించామన్నారు. సులు ప్రావిన్స్‌లోని పాటికుల్ అనే పర్వత పట్టణంలోని బంగ్‌కాల్ విలేజ్‌లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు సోబెజన తెలిపారు. విమానం రన్‌వేను మిస్ కావడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Plane crashes in the Philippines

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page