అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

0 13

తుగ్గలి ముచ్చట్లు:

 

అప్పుల బాధ తాళలేక బోయ  తిమ్మగురుడు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు.వివరాల్లోకి వెళ్ళగా తుగ్గలి మండల పరిధిలోని లింగనేని దొడ్డి గ్రామంలో ఆదివారం రోజున బోయ తిమ్మగురుడు(45) అనే రైతు తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.సరైన వర్షాలు పడక అప్పుల భారం పూర్తిగా పెరిగిపోవడంతో మనో వేదన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.చనిపోయిన రైతుకు ముగ్గురు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు.విషయం తెలుసుకున్న తుగ్గలి మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిరుపాలు నాయుడు బాధిత రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి,చనిపోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేసి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Farmer commits suicide due to debt

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page